కేసీఆర్‌పై మండిపడ్డ విజయశాంతి

2 Aug, 2013 21:21 IST|Sakshi
కేసీఆర్‌పై మండిపడ్డ విజయశాంతి

హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై విజయశాంతి మండిపడ్డారు.  తెలంగాణ వస్తే ఆంధ్రా ఉద్యోగులు వెళ్లి పోవాల్సిందేనన్న కేసీఆర్ వ్యాఖ్యలు సీమాంధ్ర ఉద్యోగుల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆమె తెలిపారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఏర్పాటుకు ఆటంకం కల్గించే విధంగా విజయశాంతి విమర్శించారు. తాజాగా ఆంధ్రా ఉద్యోగులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చేయడంతో వివాదం రాజకుంది. కేసీఆర్ వ్యాఖ్యలను పలువురు నేతలు ఖండించారు.  ఈ నేపథ్యంలో విజయశాంతి కూడా మీడియా ముందుకొచ్చారు. . కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఏర్పాటుకు ఆటంకం కల్గించే విధంగా ఆమె విమర్శించారు.

అంతకుముందు మెదక్ లోక్‌సభ స్థానం నుంచి  కేసీఆర్ పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడతున్న క్రమంలోనే విజయశాంతి పార్టీని వీడతారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరేందుకు విజయశాంతి మంతనాలు సాగించిందనే పక్కా సమాచారంతో సస్పెన్షన్ వేటు వేశారు. ‘తల్లి తెలంగాణ’ వ్యవస్థాపక అధ్యక్షురాలు విజయశాంతి 2009 సాధారణ ఎన్నికలకు ముందు తాను స్థాపించిన సంస్థను టీఆర్‌ఎస్‌లో విలీనం చేసింది. మెదక్ జిల్లాతో ఏ విధమైన సంబంధం లేకున్నా ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి విజయశాంతి అభ్యర్థిత్వం అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం పార్టీని వీడిన విజయశాంతి కేసీఆర్ పై మండిపడింది.

>
మరిన్ని వార్తలు