డ్ర‌గ్స్ ముఠాల భ‌ర‌తం ప‌డ‌తాం

16 Jul, 2020 16:39 IST|Sakshi

విజ‌య‌వాడ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు

సాక్షి, విజయవాడ: డ‌్ర‌గ్స్ మాఫియాపై ప్ర‌త్యేక నిఘా పెట్టామ‌ని విజ‌య‌వాడ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు అన్నారు. న‌గ‌రంలోకి గంజాయి ఎక్కువ‌గా వ‌స్తున్న‌ట్లు గుర్తించామ‌న్నారు. గోవా, క‌ర్ణాట‌క నుంచి వ‌స్తున్న సింథ‌టిక్ డ్ర‌గ్స్‌పైనా దృష్టి సారించామ‌న్నారు. ఇప్ప‌టికే డ్ర‌గ్స్‌కు సంబంధించి రెండు కేసుల్లో న‌లుగురు విదేశీయుల‌ను అరెస్ట్ చేశామ‌ని తెలిపారు. ఒరిస్సా, విశాఖప‌ట్నంల నుంచి విజయవాడ మీదుగా కర్ణాటక, మహారాష్ట్ర‌ల‌కు స్మగ్లింగ్ జరుగుతోందమ‌న్నారు. ఆరు నెల‌ల్లో మూడు కిలోల‌కు పైగా గంజాయిని ప‌ట్టుకుని 50 మందిని అరెస్టు చేశా‌మ‌ని వివ‌రించారు. (ఆత్మహత్యకు ముందు యువతి సెల్ఫీ వీడియో )

గురువారం సీపీ బ‌త్తిన శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. విదేశీయుల నుంచి డ్ర‌గ్స్ కొనుగోలు చేసిన న్యాయ‌ విద్యార్థి అర్జున్ నుంచి వివ‌రాలు సేక‌రించామ‌న్నారు. అత‌ను చెప్పిన వివ‌రాల మేర‌కు డ్ర‌గ్స్ వాడ‌కానికి అల‌వాటు ప‌డ్డ ఆరుగురిని గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చామ‌ని తెలిపారు. వాళ్లంద‌రినీ డీ అడిక్ష‌న్ సెంట‌ర్‌కు త‌ర‌లించామ‌ని పేర్కొన్నారు. యువ‌త‌ను మ‌త్తువైపు మ‌ళ్లిస్తున్న డ్రగ్స్ స‌ర‌ఫ‌రా ముఠాల భ‌ర‌తం ప‌డ‌తామని హెచ్చ‌రించారు. మ‌రోవైపు పిల్ల‌ల న‌డ‌వ‌డికను త‌ల్లిదండ్రులు ఎప్పుడూ ప‌ర్య‌వేక్షిస్తుండాల‌ని సూచించారు. నిర్ల‌క్ష్యం చేస్తే పిల్ల‌లు చెడుదారి ప‌ట్టి భ‌విష్య‌త్తును పాడు చేసుకునే ప్రమాదం ఉంద‌ని ఆయ‌న‌ హెచ్చ‌రించారు. (రౌడీ షీట‌ర్‌పై ఆరు నెల‌ల బ‌హిష్క‌ర‌ణ‌)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా