‘ఏదైనా జరిగితే ప్రతిపక్షాలదే బాధ్యత’

16 Jul, 2020 16:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా ఆస్పత్రిని గురువారం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2015లోనే ఉస్మానియాను కూల్చి కొత్త భవనాన్ని నిర్మిస్తామన్నామని, కానీ కాంగ్రెస్‌ నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు​ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వి. హనుమంతరావులు అడ్డుకున్నారని విమర్శించారు.

గతంలో  ఉస్మానియా ఆస్పత్రి వద్ద ప్రభుత్వ సిబ్బందిని ఉత్తమ్‌, వీహెచ్‌లు అడ్డుకుంటున్న వీడియో క్లిప్పింగ్స్‌ని మీడియాకు చూపించారు. ఏదైనా జరిగితే ప్రతిపక్షాలదే బాధ్యత అని హెచ్చరించారు. నిన్న వర్షం పడితే కాంగ్రెస్‌ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని, ప్రతిపక్షాలకు మంచి చేసే అలోచన లేదని దుయ్యబట్టారు. భవిష్యత్తులో పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని తలసాని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు