రాజధాని విజయవాడే..

5 Sep, 2014 01:53 IST|Sakshi
రాజధాని విజయవాడే..

అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 11.11 గంటలకు ప్రకటన
 20 పేజీల ప్రకటనను సభకు అందించిన సీఎం
అందరి మనోభావాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం
 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిని విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు గురువారం శాసన సభలో సుదీర్ఘ ప్రకటన చదివి వినిపించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 11.11 గంటలకు సీఎం ఈ ప్రకటన చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు సమదూరంలో ఉన్న విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయాలని ఈనెల 1వ తేదీన (1-9-2014న) జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. అభివృద్ధిని వికేంద్రీకరించడం కోసం 3 మెగా సిటీలు, 14 స్మార్ట్ సిటీలు నిర్మిం చాలని నిర్ణయించింది. రాజధానిని భూ సమీకరణ ద్వారా నిర్మించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం తగిన నిర్ణయాలు తీసుకుంటుంది’’అని ప్రకటించారు. రాజధానిపై ఇరవై పేజీల ప్రకటన పాఠాన్ని ఆయన సభకు అందించారు. ప్రజాబాహుళ్యం నుంచి వ్యక్తమైన విస్తృత అభిప్రాయాలు, వ్యక్తీకరణల నేపథ్యంలో అందరి మనోభావాలను పరి గణనలోకి తీసుకొని ఈ నిర్ణయం చేసినట్లు వివరించారు. ‘‘రాజధాని నగరం పరిపాలన, ఆర్థిక ప్రగతి, సాంస్కృతిక అనుసంధానం కలయికలతో నిర్మాణం కావలసి ఉంది. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందనే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ గుర్తించారు.

 

రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రపంచస్థాయి వసతులతో కూడిన రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ప్రధానే ప్రకటించారు. అన్ని హంగులు, వసతులతో కూడిన రాజధాని నిర్మాణం కోసం ప్రపంచస్థాయి పట్టణాభివృద్ధి నిపుణులు, వ్యూహకర్తలు, ప్రణాళిక నిపుణులను భాగస్వామ్యం చేస్తున్నాం’’ అని వివరించారు. రాష్ట్ర రాజధాని, రాజధాని విధుల నిర్వహణ ఎక్కడ నుంచి జరగాలనే అంశాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయని, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి తుది నిర్ణయాలు తీసుకొనే అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికే ఉందనే విషయాన్ని శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో స్పష్టంగా తెలిపింది. శివరామకృష్ణన్ కమిటీకి అందిన వినతుల్లో 50 శాతం అభిప్రాయాలు విజయవాడ- గుంటూరు పరిసర ప్రాంతాలే రాజధాని ఏర్పా టుకు అనువైన ప్రదేశమని స్పష్టంచేశాయి. విజ యవాడ పరిసరాల్లో ఏర్పాటయ్యే రాజధానే అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటూ  ప్రజా సంక్షేమానికి సేవలందించగలదని నిర్ణయం తీసుకున్నాం’’ అని వివరించారు.


 ‘‘రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరించి అ న్ని ప్రాంతాలు, జిల్లాలను ప్రగతిపథంలో పయనింపచేయడం ప్రస్తుత విపత్కర తరుణంలో ప్రభుత్వంపై ఉన్న బాధ్యత. రాష్ట్రానికి అనేక సంక్లిష్ట సవాళ్లు ఎదురైనప్పటికీ సహజసిద్ధ వనరులు, మానవ వనరులు ఒక వరం. సమగ్రాభి వృద్ధి లక్ష్య సాధనకు ప్రభుత్వం ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, నాలుగు విభిన్న సందేశాత్మక కార్యక్రమాలను చేపట్టింది. అందరికీ నీరు, 24 గం టలు విద్యుత్ సరఫరా, ప్రతి ఇంటికీ గ్యాస్ సరఫరా, ప్రతి గ్రామానికీ బీటీ రోడ్డు, ఆప్టిక్ బ్రాడ్‌బాండ్ కనెక్టివిటీ  కల్పించడం అనేవి గ్రిడ్లుగా ఉన్నాయి. పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తోం ది, నీరు - చెట్టు అనే ఉద్యమ కార్యక్రమాలు చేపడతాం. తక్కువ వర్షపాతం ఉన్న అనంతపురం తదితర జిల్లాల్లో డ్రిప్, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యమిస్తున్నాం. కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో టెక్స్‌టైల్ క్లస్టర్లు రానున్నాయి.

 

బీచ్‌లు, దేవాలయాలు, నీటి వనరులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు పర్యాటక రంగం లో నూతన అభివృద్ధిని సాధించేలా సర్క్యూట్ ప్రణాళిక సిద్ధమవుతోంది. దొనకొండ, అవుకు, అనంతపురం జిల్లాల్లో పారిశ్రామికవాడల అభివృద్ధికి ప్రతిపాదిస్తున్నాం. కడపలో ఇప్పటికే ఉక్కు కర్మాగారం ప్రారంభ దశలో ఉంది. కర్నూలు, కడప జిల్లాల్లో సిమెంటు పరిశ్రమల ఏర్పాటు ప్రభుత్వ సంకల్పం. రాయలసీమలోని అన్ని జిల్లాల నుంచి రాజధానికి, వివిధ పోర్టులకు రోడ్డు మార్గాలను ఏర్పాటుచేస్తాం. ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు ఏర్పాటు చేస్తాం. పోర్టుల అభివృద్ధి, తీరప్రాంత జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటు, బీచ్‌ల ఆధునీకరణ ప్రణాళికలు చేపడతాం. విశాఖలో మెగా ఐటీ హబ్, విజయవాడ, తిరుపతితోపాటు పలు నగరాల్లో ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చే స్తాం. మచిలీపట్నంలో నూతన రిఫైనరీ, క్రాకరీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తాం. రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి కోసం పునర్నిర్మాణ చట్టంలో ఇచ్చిన హామీలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాం.
 
 కేంద్రం మంజూరు చేసే విద్యా సంస్థలు, జాతీయ సంస్థలను అన్ని ప్రాంతాలకూ సమానంగా విస్తరిస్తాం. వైజాగ్ - చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా నెల్లూరు - వైజాగ్ పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. శ్రీకాకుళం, పైడిభీమవరం, విశాఖపట్నం, కాకినాడ, గన్నవరం, కంకిపాడు, శ్రీకాళహస్తి - ఏర్పేడులు క్లస్టర్లుగా ఉంటాయి. చెన్నై - బెంగళూరు కారిడార్లో కృష్ణపట్నం, చిత్తూరు, హిందూపురం పారిశ్రామిక ప్రాంతం ఉన్నాయి. ఈ పారిశ్రామిక క్లస్టర్లు, అనుసంధాన ప్రాజెక్టులను అమలు చేసేందుకు వివిధ ఏజెన్సీల సమన్వయంతో వనరుల సమీకరణకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాం. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలను కలుపుతూ ఇప్పటికే ఉన్న ప్రధాన రహదారులకు అనుసంధానం చేస్తూ రోడ్డు, రైలు రవాణా మార్గాలను అభివృద్ధి చేస్తాం. కర్నూలు - అనంతపురం రహదారిని గుంటూరుతో కలుపుతూ ఒక మార్గం నిర్మిస్తాం. నూతన రాజధానితో అనంతపురాన్ని కలుపుతూ కర్నూలు - గిద్దలూరు - వినుకొండ ద్వారా మరో మార్గాన్ని, రాయలసీమ ప్రాంతాన్ని కృష్ణపట్నం పోర్టుకు కలుపుతూ ఇంకొక రహదారిని నిర్మిస్తాం. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలను మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తాం. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో మెట్రో రైలు ప్రాజెక్టులు చేపడుతున్నాం. రాజధాని ఏర్పాటయ్యే ప్రాంతంలోని భూమి యజమానులు, స్థానిక ప్రజలు, ప్రభుత్వం పరస్పర సహకారంతో కొత్త రాజధాని ప్రజా రాజధానిగా వర్థిల్లగలదని ప్రభుత్వం నమ్ముతోంది’’ అని బాబు తన ప్రక టనలో వివరించారు.
 

మరిన్ని వార్తలు