వి లవ్ పార్టీ

4 May, 2015 09:02 IST|Sakshi
వి లవ్ పార్టీ

డీజే పబ్ కల్చర్ ఈ మధ్య కాలంలో సిటీలో ఎక్కువగా విస్తరించింది. వీకెండ్ నైట్స్‌లో కుర్రకారు అలా పబ్‌లకు వెళ్తూ ఫుల్ జోష్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. దాంతోపాటు యూత్ ఆలోచనలను దృష్టిలో ఉంచుకొని ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా డిఫరెంట్ థీమ్ పార్టీలు, రెట్రో స్టైల్, పూల్, రాక్ బ్యాండ్, హేలొవెన్ నైట్స్ వంటి పాపులర్ పార్టీలకు మొగ్గు చూపుతున్నారు. ప్రతి అకేషన్‌ను థీమ్ పార్టీలతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు...’’’అంటున్నారు..ముగ్గురు సిటీ కుర్రాళ్లు. అదీ అంత గట్టిగా ఎలా చెబుతారని అంటున్నారా...? వైజాగ్ పార్టీస్ అనే ఫేస్‌బుక్ ఈవెంట్స్ మార్కెటింగ్ పేజీని నడుపుతున్న ముగ్గురు కుర్రాళ్లు వైజాగ్‌లో పార్టీల విషయంలో యూత్ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆన్‌లైన్ సర్వే ద్వారా పేజీని ఫాలో అవుతున్న వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. సుమారు 1200 మంది యూత్ ఈ సర్వేలో పాల్గొని వారి అభిప్రాయాలను తెలియజేశారు. వైజాగ్‌లో పార్టీలకు ఎంత వరకు ఖర్చు చేయొచ్చని అడిన ప్రశ్నకు సుమారు 53.1 శాతం మంది యూత్ 500 రూపాయలు రిజిస్ట్రేషన్ సరిపోతుందని చెప్పగా 30.6 శాతం యూత్ వేయి రూపాయల వరకు వెచ్చించిన ఫర్వాలేదని సమాధానం చెప్పారు. అలానే వైజాగ్‌లో నైట్ పార్టీల్లో ఈ మధ్య కాలంలో బాగా దేనిలో ఎక్కువ ఇంప్రూవ్‌మెంట్ ఉన్నదనే విషయానికి 46.2 శాతం మంది పార్టీలకు వచ్చే వారి సంఖ్య ఎక్కువైందని సూచించగా, 37.6 శాతం మంది ఆర్టిస్ట్‌లు, డీజేలు ఎక్కువగా వైజాగ్‌లో పార్టీలకు వస్తున్నారని చెప్పారు. అలానే వైజాగ్‌లో పార్టీల్లో క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకుంటే అందులో 38.4 శాతం మంది 3 పాయింట్స్ రేటింగ్ ఇవ్వగా 23.2 మంది 4 పాయింట్ రేటింగ్ ఇచ్చారు. అలానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు సంఖ్యలో వైజాగ్ పార్టీల్లో ఎలా ఉందో తెలుసుకుంటే అందులో 86.5 శాతం మంది  ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందని సమాధానం చెప్పారు. ఇలా వైజాగ్‌లో పార్టీ కల్చర్ గురించి షేర్ చేసుకున్నారు.
 థీమ్ పార్టీలకే యూత్ ఓటు...
 
 యూత్ అంటే బేసిగ్గా లేట్‌నైట్ పార్టీలు, పబ్‌పై ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ నైట్ పార్టీల్లో ముంబాయ్, కోల్‌కతా, బెంగుళూర్, డిల్లీ నుంచి ఫేమస్ డీజేలను తీసుకొచ్చి ఈవెంట్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నైట్ పార్టీలను ఇష్టపడే యూత్ వీటికి ఎట్రాక్ట్ అవుతున్నారు. దాంతోపాటు రిజిస్ట్రేషన్ కాస్ట్ కూడా 500 రూపాయిలు మాత్రమే ఉండడంతో మధ్యతరగతి, హైఫై యూత్ అందరూ  వీకెండ్ పార్టీలపై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అలానే మిగిలిన సిటీస్‌తో పోల్చుకుంటే కొన్ని లిమిట్స్‌లో పార్టీలు జరగడంతో యూత్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అలానే కొన్ని స్పెషల్ ఈవెంట్స్‌లో ఆర్టిస్ట్‌లను కూడా తీసుకొచ్చి స్పెషల్ అట్రాక్షన్ అందిస్తున్నారు. దాంతోపాటు థీమ్ పార్టీలకు ఈ మధ్య కాలంలో నగరంలో డిమాండ్ బాగా పెరిగింది. కొత్తదనం కోరుకునే సిటీ యూత్ కోసం డిఫరెంట్ థీమ్స్‌తో వీకెండ్ పార్టీలు నిర్వహిస్తున్నారు.
 - మహేష్ తేజ,
 వైజాగ్ పార్టీస్ మేనేజింగ్ డెరైక్టర్

మరిన్ని వార్తలు