న్యూజిలాండ్ లో భూకంపం | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్ లో భూకంపం

Published Mon, May 4 2015 8:59 AM

న్యూజిలాండ్ లో భూకంపం

వెల్లింగ్టన్: న్యూజిలాండ్లో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదైంది. న్యూజిలాండ్లోని వనాక పట్టణానికి వాయవ్య దిశలో 30 కిలో మీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. దీని ప్రభావం వల్ల న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్లో భూ ప్రకంపనలు వచ్చాయి. భూమి పలుమార్లు కంపించినట్టు న్యూజిలాండ్ మీడియా వెల్లడించింది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదు.
 

Advertisement
Advertisement