జగన్‌కు ఘనస్వాగతం

6 Oct, 2015 01:01 IST|Sakshi
జగన్‌కు ఘనస్వాగతం

పర్యటనలో పోటెత్తిన జనం
అందరినీ అప్యాయంగా పలుకరించిన విపక్షనేత
ఆయన వాహనశ్రేణిని అనుసరించిన పార్టీ కార్యకర్తలు

 
విశాఖపట్నం/తగరపువలస: భోగాపురం ఎ యిర్‌పోర్టు నిర్వాసిత రైతాంగపక్షాన నిలిచేం దుకు సోమవారం విశాఖ చేరుకున్న  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డికి ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తుల వచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆయన భోగాపురానికి బయలుదేరారు. మార్గ మధ్యలో భీమిలి మండలం మజ్జివలసలో  పోర్ట్‌ట్రస్ట్ సభ్యుడు దాట్ల వెంకట అప్పలప్రసాదరాజు ఇంటివద్ద కాస్సేపు ఆగారు. ఈసందర్భంగా ఆ గ్రామానికి జనం భారీగా తరలివచ్చి జగన్‌కు స్వాగతం పలికారు. భీమిలి నియోజకవర్గంతో పాటు నగరం నుంచి కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. అక్కడకు వచ్చిన వారందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించారు. మహిళలు, చిన్నపిల్లలతో జగన్‌మోహన్‌రెడ్డి పలుకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకున్నారు. జగన్ రాకతో గ్రామం కోలాహలంగా మారింది. ఆయనకు స్వాగతం పలికేందుకు ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ ముఖ్యనాయకులతో పాటు, జిల్లాకు చెందిన సమన్వయకర్తలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు.

అనంతరం ఆయన అక్కడ నుంచి మహరాజుపేటకూడలి మీదుగా రాజాపులోవ వైపు ఆయన వెళ్లారు. ఆయన వాహన శ్రేణిని కార్యకర్తలు, నాయకులు ద్విచక్రవాహనాలతో ర్యాలీగా అనుసరించారు. ఈ పర్యటనలో వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యేలు సుజ య్ కృష్ణ రంగారావు, గిడ్డి ఈశ్వరి, బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్సీ సూర్య నారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, చెంగల వెంకటరా వు, కర్రి సీతారాం, కరణం ధర్మ శ్రీ, మళ్ళ విజయప్రసాద్, తైనాల, నియోజకవర్గ సమన్వయకర్తలు కోలా గురువులు, వంశీకృష్ణ, అదీప్ రాజ్, తిప్పల నాగిరెడ్డి, పెట్ల ఉమాశంకర గణేష్, ప్రగడ నాగేశ్వరరావు, సీఈసీ సభ్యులు దామ సుబ్బారావు, శ్రీకాంత్ రాజు, పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ర్ట కార్యదర్శులు జాన్ వెస్లీ, కంపా హనోక్, రాష్ర్ట ప్రచార కమిటీ కార్యదర్శి రవిరెడ్డి, మైనార్టీ సెల్ ఉత్తరాంధ్ర సమన్వయ కర్త ఫారూకీ, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఉషాకిరణ్, షరీఫ్, బోణి వేణు, ఆడారి రవికుమార్‌లతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు