పాకిస్తాన్‌దే సిరీస్ | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌దే సిరీస్

Published Tue, Oct 6 2015 12:57 AM

పాకిస్తాన్‌దే సిరీస్ - Sakshi

చివరి వన్డేలో జింబాబ్వేపై గెలుపు
 హరారే: కెరీర్ రెండో వన్డేలోనే ఆఫ్ స్పిన్నర్ బిలాల్ ఆసిఫ్ (5/25) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా కీలకమైన మూడో వన్డేలో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో జింబాబ్వే జట్టును చిత్తు చేసింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో దక్కించుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 38.5 ఓవర్లలో 161 పరుగులకు కుప్పకూలింది.
 
  ఓపెనర్లు ముటుంబమి (85 బంతుల్లో 67; 5 ఫోర్లు; 2 సిక్సర్లు), చిబాబ (76 బంతుల్లో 48; 5 ఫోర్లు) తొలి వికెట్‌కు 89 పరుగులతో శుభారంభాన్నిచ్చినా మిడిలార్డర్‌ను ఆసిఫ్ దెబ్బతీయడంతో ఇబ్బందుల్లో పడింది. ఇమాద్ వాసింకు మూడు వికెట్లు పడ్డాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్ 34 ఓవర్లలో మూడు వికెట్లకు 162 పరుగులు చేసి గెలిచింది. బ్యాట్‌తోనూ రాణించిన ఆసిఫ్ (39 బంతుల్లో 38; 6 ఫోర్లు; 1 సిక్స్), అసద్ షఫీఖ్ (60 బంతుల్లో 38; 2 ఫోర్లు) టాప్ స్కోరర్లు కాగా... మ్యాన్ ఆఫ్ ద సిరీస్ షోయబ్ (28 బంతుల్లో 34; 5 ఫోర్లు; 1 సిక్స్) వేగంగా ఆడాడు.
 

Advertisement
Advertisement