పొత్తుపై చంద్రబాబు ఎందుకు స్పందించరు? : వీర్రాజు

18 Dec, 2013 19:28 IST|Sakshi

హైదరాబాద్:  బీజేపీతో పొత్తుపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించరు? అని  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు ప్రశ్నించారు.  1999లో 17 మంది బీజేపీ అభ్యర్థులను టీడీపీ ఓడించిందని ఆయన చెప్పారు. తాము ఎదగకుండా కావాలనే కథనాలు రాయించుకుంటుందని మండిపడ్డారు.

తమ రాష్ట్ర అధ్యక్షుడు పొత్తు ఉండదని స్పష్టంగా చెప్పారన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి, తమ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ హవాను టీడీపీ క్యాష్‌ చేసుకోవాలనుకుంటోందని విమర్శించారు. బీజేపీని మింగడానికే టీడీపీ పొత్తంటోందని ఆయన ఆరోపించారు.

మరిన్ని వార్తలు