భార్య మృతి.. భర్త ఆత్మహత్యాయత్నం..!

30 Mar, 2017 08:45 IST|Sakshi

బుక్కపట్నం(అనంతపురం): బుక్కపట్నం మండలపరిధిలోని సిద్దరాంపురం గ్రామానికి చెందిన దైవకుమార్‌ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ఎరికలప్ప కుమారుడు దైవకుమార్‌ ఏడాది క్రితం చెన్నేకొత్తపల్లి మండలం గంగినేపల్లి గ్రామానికి చెందిన నాగమణితో వివాహం జరిగింది. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో భార్య నాగమణి మంగళవారం ఆత్మహత్య చేసుకుని మృతిచెందింది. వరకట్న వేధింపులతోనే నాగమణి మృతిచెందినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు చెన్నేకొత్తపల్లి పోలీసులు దైవకుమార్‌పై కేసు నమోదు చేశారు. దీంతో మనస్థాపానికి గురైన దైవకుమార్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బత్తలపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దైవకుమార్‌పై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ గోవిందు తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు