'ఛైర్మన్ ఎన్నిక వాయిదా వేసేందుకు టీడీపీ కుట్ర'

4 Jul, 2014 09:49 IST|Sakshi
'ఛైర్మన్ ఎన్నిక వాయిదా వేసేందుకు టీడీపీ కుట్ర'

మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో మరోసారి టీడీపీ అక్రమాలకు యత్నిస్తోందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి శుక్రవారం జమ్మలమడుగులో ఆరోపించారు. తప్పుడు కేసులతో  మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని వారు విమర్శించారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వారు ప్రభుత్వ అధికారులకు సూచించారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.


ఛైర్మన్ను ఎన్నుకోనేందుకు తగిన కోరం ఉన్నా ఎన్నికను గురువారం నిర్వహించకుండా శుక్రవారానికి వాయిదా వేయడం దారుణమని అన్నారు. ఈ రోజు ఛైర్మన్ ఎన్నికను అధికారులు పూర్తి చేస్తారని నమ్ముతున్నట్లు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలు  చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు