296వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

12 Nov, 2018 18:03 IST|Sakshi

సాక్షి, విజయనగరం : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 296వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం జననేత సాలూరు నియోజకవర్గం, మక్కువ మండలంలోని తన నైట్ క్యాంప్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కంచేడువలస క్రాస్‌ మీదుగా వెంకటభిరిపురంకు చేరుకుంటారు. అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బగ్గందొర వలస, గెద్దలుప్పి జంక్షన్‌ మీదుగా తామరకండి వరకూ పాదయాద్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 295వ రోజు ముగిసింది. గత నెల 25న విశాఖ ఎయిర్‌ పోర్ట్‌లో ఆయనపై హత్యాయత్నం జరగడం.. చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో జననేత పాదయాత్రకు స్వల్ప విరామం ప్రకటించిన విషయం తెలిసిందే.17 రోజుల విశ్రాంతి అనంతరం వైఎస్‌ జగన్‌ తన 295వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం సాలూరు నియోజకవర్గం, పాయకపాడులో పున: ప్రారంభించారు. అక్కడి నుంచి మేలపువలస, మక్కువ క్రాస్‌ రోడ్డు, ములక్కాయవలస, కాశీపట్నం క్రాస్‌ రోడ్డు, పాపయ్య వలస మీదుగా కొయ్యనపేట వరకూ పాదయాత్రను కొనసాగించారు. నేడు జననేత 6.8కిలో మీటర్ల దూరం నడిచారు. దీంతో ఇప్పటి వరకూ 3,218.3కిలో మీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు.
 

మరిన్ని వార్తలు