314వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

6 Dec, 2018 08:55 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జననేత 314వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం రెడ్డిపేట శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి లోలుగు, నందివాడ క్రాస్‌, నర్సాపురం అగ్రహారం, కేశవదాసుపురం క్రాస్‌, చిలకలపాలెం మీదుగా ఎచ్చెర్ల వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం చిలకలపాలెంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. 

వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. జననేత ఇప్పటివరకు 3,390.3 కిలోమీటర్లు నడిచారు.

 
డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు నివాళ్ళు అర్పించిన వైస్ జగన్..
రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణ దాస్, మజ్జి శ్రీనివాస్ తమ్మినేని సీతారాం, రాజన్న దొర, కంబాల జోగులు, పుష్పశ్రీ వాణి, కళావతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు