26నుంచి వైఎస్ జగన్ బస్సు యాత్ర

23 Mar, 2015 10:13 IST|Sakshi
26నుంచి వైఎస్ జగన్ బస్సు యాత్ర

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల స్థితిగతులు తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 26 నుంచి బస్సుయాత్ర చేపట్టనున్నట్లు వైఎస్ఆర్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు తెలిపారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్లతో పాటు ప్రకారం బ్యారేజీలను ఆయన పరిశీలించనున్నట్లు చెప్పారు. అలాగే పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్తో పాటు రాయలసీమలోని అన్ని ప్రాజెక్ట్లను వైఎస్ జగన్ పర్యటించనున్నారు.


వైఎస్ఆర్ సీఎల్పీ సమావేశం అనంతరం జ్యోతుల నెహ్రు సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడారు. స్పీకర్ వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటుగా ఉందని ..రైతు సమస్యలను వైఎస్ జగన్ ...సభ దృష్టికి తీసుకొస్తున్న సమయంలో స్పీకర్ నిర్దిద్వందంగా తిరస్కరించారన్నారు.  తాము ఎంత అభ్యర్థించినా స్పీకర్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. అధికార పార్టీకి స్పీకర్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని జ్యోతుల నెహ్రు విమర్శించారు.  

పట్టిసీమ ప్రాజెక్ట్ స్థితిగతులపై వచ్చే గురువారం నుంచి వైఎస్ జగన్ బస్సు యాత్ర చేస్తారని జ్యోతుల నెహ్రు వెల్లడించారు.  ప్రజా పోరాటాల ద్వారానే అన్యాయాలను ఎదుర్కొనాలని వైఎస్ జగన్ నిర్ణయించారని ఆయన అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రతిపక్షంగా తమ పోరాటం ఆగదని జ్యోతుల నెహ్రు స్పష్టం చేశారు. అధికార పక్షం తీరు ఏమాత్రం బాగోలేదని ఆయన మండిపడ్డారు. మరోవైపు టీడీపీ అరాచకాలపై వైఎస్ఆర్ సీపీ మంగళవారం మాక్ అసెంబ్లీ నిర్వహించనుంది.

మరిన్ని వార్తలు