ప్రజాసంకల్పయాత్ర 39వ రోజు షెడ్యూల్

18 Dec, 2017 19:57 IST|Sakshi

సాక్షి, అనంతపురం: వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి 39వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారైంది. మంగళవారం పాదయాత్ర షెడ్యూల్‌ను వైఎస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. రేపు (మంగళవారం) ఉదయం 8 గంటలకు ధర్మవరం మండలం తనకంటివారిపల్లె నుంచి వైఎస్ జగన్‌ పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 8:30 గంటలకు పుట్టపర్తి నియోజకవర్గంలోని కృష్ణాపురం చేరుకుంటారు. అక్కడ పార్టీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారు. రామసాగరం క్రాస్, యడలంకపల్లె క్రాస్ మీదుగా 10 గంటలకు మరల గ్రామానికి చేరుకుని రైతులతో వారి సమస్యలపై చర్చిస్తారు. డీడీ కొట్టాలకు చేరుకున్న అనంతరం 12:30 గంటలకు అక్కడ భోజన విరామం తీసుకుంటారు.

2:45 గంటలకు బుక్కపట్నం నుంచి పాదయాత్ర పున: ప్రారంభమవుతుంది. 3:15 గంటలకు మంగళ మడక క్రాస్ చేరుకుంటారు. అక్కడినుంచి ధర్మవరం నియోజకవర్గంలోని గరుగు తాండ, 4.30 గంటలకు పుట్టపర్తి నియోజకవర్గంలోని అగ్రహారం క్రాస్ మీదుగా సాయంత్రం 5 గంటలకు పాముదుర్తి వరకు పాదయాత్ర సాగుతుంది. సాయంత్రం 6 గంటలకు 39వ రోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసిన అనంతరం వైఎస్ జగన్ రాత్రి అక్కడే బస చేస్తారు.

మరిన్ని వార్తలు