30న పలాసలో ప్రజాసంకల్పయాత్ర బహిరంగ సభ

10 Dec, 2018 07:42 IST|Sakshi
కాశీబుగ్గ బస్టాండ్‌ వద్ద స్థల పరిశీలన చేస్తున్న తలశిల రఘురాం, సీదిరి అప్పలరాజు

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం

శ్రీకాకుళం , కాశీబుగ్గ : పలాస–కాశీబుగ్గ పట్టణంలో ఈనెల 30న ప్రజా సంకల్పయాత్ర బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం చెప్పారు. ఆదివారం కాశీబుగ్గ బస్టాండ్‌ వద్ద పలాస సమన్వయకర్త సీదిరి అప్పలరాజుతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర రూట్‌మ్యాప్, సభా ప్రాంగణం తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఆయనతో పాటు పార్టీ జిల్లా కార్యదర్శి బళ్ల గిరిబాబు, పోతనపల్లి ధర్మారావు, బడగల బాలచంద్రుడు, సైని దేశయ్య, రాపాక శేషగిరి, మట్ట ఆనంద్, సీదిరి త్రినాథ్‌ పాల్గొన్నారు.

కనీస వేతనాలు కరువే
ప్రభుత్వం 104 సంచార చికిత్స ఉద్యోగులకు కనీస వేతనాలు అందజేయడం లేదన్నా. సంచార చికిత్స మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జీఓ 151 ప్రకారం వేతనాలు అందజేస్తామని 2016లో ప్రభుత్వం తెలియజేసినా ఇంతవరకు అమలు చేయలేదు. 11 ఏళ్లుగా చాలీచాలని జీతాలతో విధులు నిర్వర్తిస్తున్నాం. మా న్యాయమైన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలన్నా..
– చింతాడ వరుణ్‌ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ‘104’ సంఘం

>
మరిన్ని వార్తలు