చీకటి చీల్చి.. వెలుగు పంచి

2 Sep, 2018 09:35 IST|Sakshi

మంచి చేసిన నాయకులను జనం ఎప్పటికీ మరిచిపోరు. ప్రజాసంక్షేమం కోసం దేనికీ రాజీపడని నేతలను ప్రజలు గుండెల్లో ఉంచుకుంటారు.ప్రజల గుండెలో చెరగని ముద్ర వేసుకున్న దివంగత మహానేత ముఖ్యమంత్రి వైఎస్‌ను జనం గుండెల్లో దాచుకున్నారు. అంతటి మహానుభావుడి అకాల మరణం తట్టుకోలేక అతని వెంటే తనువు చాలించిన ఆత్మబంధువుల కుటుంబీకులను ఓదార్చేందుకు రాజన్న ముద్దుబిడ్డ ప్రజల ఆశాజ్యోతి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేనున్నానంటూ అప్పటిలో భరోసా కల్పించి ఆర్థికంగా అండగా నిలిచారు. అలా సాయం పొందిన వారంతా వైఎస్‌ కుటుంబం చల్లగా ఉండాలని, విజయమ్మ తనయుడు ఉన్నతశిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. 

ఓదార్పు మరువలేనిది
మునగపాక: ఓదార్పుయాత్రలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సాయం మరువలేనిదని మునగపాక మండలం నాగవరం గ్రామానికి చెందిన మేడిశెట్టి నరసింగరావు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వైఎస్‌ మరణవార్త వినిన నరసింగరావు టీవీ చూస్తూ తొమ్మిదేళ్లక్రితం కుప్పకూలిపోయాడు. ఓదార్పు యాత్రలో భాగంగా 2010లో జగన్‌మోహన్‌రెడ్డి నాగవరం విచ్చేసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పిల్లల చదువుతోపాటు కుటుంబాన్ని ఆదుకుంటామని అప్పటిలో భరోసా తోపాటు ఆర్థికసాయం అందించారు.  నేటికీ జగనన్న అందించిన తోడ్పాటును కుటుంబ సభ్యులు మరువలేకున్నారు. మహానేత బతికి ఉంటే ఎన్నో కుటుంబాలకు మేలు జరిగేదని అయితే జగనన్న సీఎం కావాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షిస్తున్నారు.  ప్రస్తుతం నరసింగరావు కుమారుడు వెంకటప్పారావుపైనే కుటుంబం ఆధారపడి ఉంది. వెంకటప్పారావు సమీపంలోని అచ్యుతాపురం బ్రాండెక్స్‌లో ఉద్యోగం చేసుకుంటూ తద్వారా వచ్చే ఆదాయంపై కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.

జగన్‌బాబు మనసున్న మారాజు
ఎస్‌.రాయవరం: మహానేత వైఎస్‌ మరణం తట్టుకోలేక ఎస్‌.రాయవరం మండలం వాకపాడు గ్రామానికి చెందిన తారుతూరు అప్పారావు మృతి చెందాడు. ఓదార్పు యాత్రలో భాగంగా జగన్‌బాబు పరామర్శించి, అందించిన ఆర్థిక తోడ్పా టు మరువలేనదని అప్పారావు భార్య తారుతూరు సూర్యకాంత తెలిపింది. నా కు నలుగురు సంతానం. భర్త మృతితో వారికి భారం అయ్యానని బాధపడుతున్న తరుణంలో జగన్‌బాబు ధైర్యం చెప్పా రు. ఆయన అందించిన సాయం కుటుంబానికి చేయూతనిచ్చింది. ఆయన మనసున్న మారాజు అని సూర్యకాంత తెలిపింది.

సాయం, భరోసా మరువలేనిది
ఎస్‌.రాయవరం: ఇంటి పెద్దదిక్కుకోల్పోయిన సమయంలో జగనన్న ఇచ్చిన భరోసా, ఆర్థిక తోడ్పాటు ధైర్యాన్ని ఇచ్చిందని వెంకటాపురం గ్రామానికి చెందిన వెదుళ్ల రవికుమార్‌ భార్య వెంకటలక్ష్మి తెలిపింది. వైఎస్‌ మరణ వార్తను తట్టుకోలేక మనస్తాపంతో రవికుమార్‌ మృతిచెందాడు. ఓదార్పు యాత్రలో భాగంగా జగన్‌మోహన్‌ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. భరోసాతోపాటు ఆర్థిక తోడ్పాటు అందిచడంతో సమస్యలు అధిగమించగలిగామని ఆమె పేర్కొంది. కుమారుడు ఆటో కొనుక్కొని ఉపాధి పొందుతున్నాడు. నాకుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని అప్పటిలో జగన్‌బాబు చెప్పారు. సంకల్పయాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చిన ఆయనను కలిసేందుకు అవకాశం లేకపోయింది. అయినప్పటికీ ఆయన అందించిన సాయం, భరోసా ఎన్నటికీ మరిచిపోం. ఆయన వెంటే ఉంటాం. 

తోడ్పాటు మరువలేనిది
అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం జగ్గన్నపేట గ్రామానికి చెందిన ఆడారి రాజేశ్వరి మహానేత రాజన్న మరణం తట్టుకోలేక తొమ్మిదేళ్ల క్రితం చనిపోయింది. జగ్గన్నపేట గ్రామానికి చెందిన ఆడారి సూర్యనారాయణ, నాగభూషణానికి ముగ్గురు కుమార్తెలు, సూర్యనారాయణ గతంలో సర్పంచ్‌గానూ, పాలసంఘ అధ్యక్షునిగానూ పనిచేశారు. అయితే 15సంవత్సరాల క్రితం సూర్యనారాయణ చనిపోయారు. 

ఆయన బతికున్న సమయంలో ఇద్దరు ఆడపిల్లలకు వివాహం చేశారు. చిన్నకుమార్తె రాజేశ్వరికి కాంగ్రెస్‌ పార్టీ అంతే ఎనలేని అభిమానం. అంతకన్నా దివంగత నేత రాజన్న అంటే ప్రాణం. 2009లో రాజన్న మృతి వార్త తెలుసుకున్న రాజేశ్వరి గుండెపోటుకు గురై మృతిచెందింది. 2010లో జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్రలో భాగంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాజేశ్వరి కుటుంబానికి అండగా ఉంటానంటూ జగనన్న హామీ ఇచ్చారు. ఆయన అప్పటిలో అందించిన ఆర్థిక తోడ్పాటు ఇప్పటికీ మరువలేకపోతున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.  

జగనన్నతోనే బడుగులకు న్యాయం
మాడుగుల: మండలంలోని కింతలి వల్లాపురం గ్రామానికి చెందిన మల్లవరపు కొండబాబు దివంగత నేత వైఎస్‌రాజశేఖరరెడ్డి అభిమాని. పాదయాత్రలో భాగంగా ఆయన వైఎస్‌ జిల్లాకు వచ్చినప్పుడు ఆయనతోపాటు జిల్లా దాటే వరకు నడిచాడు. 2009లో వైఎస్‌ మరణవార్త వినిన అతను మనస్తాపానికి గురై మృతి చెందాడు. పోషించే దిక్కులేకపోవడంతో అతని కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. ఓదార్పుయాత్రలో భాగంగా అప్పటిలో జగన్‌మోహన్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన అందించిన ఆర్థికసాయం కొన్నాళ్లపాటు కుటుంబ పోషణకు ఉపయోగపడిందని కొండబాబు భార్య మల్లవరపు చిన్నారి తెలిపింది. జగనన్న చెప్పిన ధైర్యంతోనే కూలీనాలిచేసి కుటుంబాన్ని నెట్టికొస్తున్నానని ఆమె వివరించింది. శ్లాబ్‌ వేసుకున్న ఇంటికి డబ్బుల్లేక మిగతా పనులు చేపట్టలేదు. కూరగాయల వ్యాపారం చేసుకునేందుకు కార్పొరేషన్‌ రుణానికి 2015లో దరఖాస్తు చేసినా ప్రయోజనం లేకపోయింది. జగనన్న సీఎం అయితేనే మాలాంటి బడుగు జీవులకు న్యాయం జరుగుతుందని చిన్నారి ఆశిస్తోంది. 

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డా 
పాయకరావుపేట: రాజన్న తనయుడు అందించిన భరోసా ఆర్థిక తోడ్పాటు వల్‌ ల మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడిందని సత్యవరం గ్రామానికి చెందిన నారాయణ లక్ష్మి పేర్కొంది. ఈమె భర్త ఎగదాసు ఉమామహేశ్వరరావు వైఎస్‌ అభిమాని. ఆయన మరణంతో మనస్తాపానికి గురయ్యారు. వైఎస్‌ ప్రథమ వర్థంతినాడు గ్రామంలో ఆయన చిత్రపటం వద్ద కొబ్బరికాయ కొడుతూ కుప్పకూలిపోయాడు. యజమాని కోల్పోవడంతో కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. ఓదార్పుయాత్రలో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి సత్యవరం వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. భరోసా ఇవ్వడమే కాకుండా, అందించిన ఆర్థిక సాయం వల్ల ఇబ్బందులు తొలగిపోయాయని నారాయణ లక్ష్మి తెలిపింది. పేదల సమస్యలు గుర్తించేది రాజన్న తనయుడు జగనన్న మాత్రమేనని, ఆయనతో ప్రజాసంక్షేమం సాధ్యమని ఆమె పేర్కొంది.  

ఆర్థిక తోడ్పాటు ధైర్యాన్నిచ్చింది
ఎస్‌.రాయవరం: చిన్నపిల్లలలో కూలి చేసుకుని జీవించే సమయంలో మా అభిమాని నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆకాల మరనాన్ని నా భర్త తట్టుకోలేక పోయారు. టీవీ చూస్తూ తుది శ్వాస విడిచారు.ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలో తెలియక ఆలస్యంగా నాయకులకు సమాచారం ఇచ్చాను. అయితే నీ భర్త పేరు చనిపోయిన వెంటనే చెప్పలేదని కారణం చూపుతూ నాయకులు చేతులెత్తేశారు. నాభర్త శ్వాస ఎలా పోయినదని మాగ్రామం మీదుగా వెళ్తున్న జగన్‌బాబుకు చెప్పుకున్నా. ఆయన ఓదార్పు, ఆర్థికసాయం నా కుటుంబాన్నే మార్చేసిందని మండలంలోని జంగులూరు గ్రామానికి చెందిన మర్తుర్తి సత్యవతి తెలిపింది.  భర్త మృతి చెందేసరికి 12 ఏళ్ల బాబు, పదేళ్ల పాప ఉన్నారు. పెంకుటిల్లు మాత్రమే ఉంది. కూలి పనిచేయడం కూడా రాదు. ఈ సమయంలో అందించిన ఆర్థికసాయం నాలో ధైర్యం నింపింది. పాపను టెన్త్, కొడుకును ఐటీఐ చదివించాం. కుమార్తెకు వివాహం చేశా. జగన్‌బాబు తోడ్పాటు అందించకుంటే ఇలా ఉండేవాళ్లం కాదు.  

సాయం, భరోసా మరువలేనిది
ఎస్‌.రాయవరం: ఇంటి పెద్దదిక్కుకోల్పోయిన సమయంలో జగనన్న ఇచ్చిన భరోసా, ఆర్థిక తోడ్పాటు ధైర్యాన్ని ఇచ్చిందని వెంకటాపురం గ్రామానికి చెందిన వెదుళ్ల రవికుమార్‌ భార్య వెంకటలక్ష్మి తెలిపింది. వైఎస్‌ మరణ వార్తను తట్టుకోలేక మనస్తాపంతో రవికుమార్‌ మృతిచెందాడు. ఓదార్పు యాత్రలో భాగంగా జగన్‌మోహన్‌ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. భరోసాతోపాటు ఆర్థిక తోడ్పాటు అందిచడంతో సమస్యలు అధిగమించగలిగామని ఆమె పేర్కొంది. కుమారుడు ఆటో కొనుక్కొని ఉపాధి పొందుతున్నాడు. నాకుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని అప్పటిలో జగన్‌బాబు చెప్పారు. సంకల్పయాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చిన ఆయనను కలిసేందుకు అవకాశం లేకపోయింది. అయినప్పటికీ ఆయన అందించిన సాయం, భరోసా ఎన్నటికీ మరిచిపోం. ఆయన వెంటే ఉంటాం. 

వైఎస్‌ ఆశయ సాధన జగన్‌తోనే సాధ్యం
భీమునిపట్నం: దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలు, ఆయన ప్రజలకు చేసిన మేలు తిరిగి ప్రజలందరికి జరగాలంటే ఆయన తనయుడు ప్రతిపక్షనేత వైఎస్‌. జగన్‌హన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని జగన్‌ద్వారా ఓదార్పు పొందిన కుటుంబ సభ్యులు అభిప్రాయపడ్డారు. వైఎస్‌ హఠాత్తుగా మరణించడాన్ని ఇక్కడ పెద్ద బజారు ప్రాంతానికి చెందిన పలుపులేటి వెంకటరమణ జీర్ణించుకోలేక చనిపోయారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా విషయంల తెలుసుకున్న జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్రలో భాగంగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. తోడ్పాటు అందించారు. ప్రస్తుతం వెంకటరమణ కొడుకులు ముగ్గురు ఉద్యోగాలు చేసుకుంటూ భీమిలిలో ఉంటున్నారు. వీరివద్దనే తల్లి పార్వతమ్మఉంటోంది, ఇద్దరు కుమార్తెలు విశాఖలో ఉన్నారు. 

జనం గుండెల్లో వైఎస్‌ పదిలం
వైఎస్‌ రాజశేఖరెడ్డి ఎవరు ఊహించని విధంగా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించి ప్రజల గుండెల్లో దేవుడిలా ఉండిపోయారు. ఇప్పుడు ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజల కోసం చేపట్టాలనుకునే సంక్షేమ కార్యక్రమాలు ఉపయోగకరంగా ఉన్నాయి. ఆయన సీఎం అయితే ప్రజలకు మేలు జరుగుతుంది. 
– పలుపులేటి పార్వతమ్మ, వెంకటరమణ భార్య 

ఆత్మవిశ్వాసం నింపిన జగనన్న
సబ్బవరం: మా తండ్రి దొడ్డి కోటేశ్వరరావు వైఎస్‌ అభిమాని. ఆయన అకాల మరణం తట్టుకోలేక చనిపోయారు. నాకు తమ్ముడు నాగ అప్పారావు, చెల్లి లక్ష్మి ఉన్నారు. చిన్నతనంలోనే అమ్మ చనిపోవడంతో మమ్మల్ని నాన్న అల్లారుముద్దుగా చూసుకునేవారు. ఆయన చనిపోవడంతో కుటుంబభారం నాపై పడింది. జగనన్న ఓదార్పుయాత్రలో భాగంగా మా కుటుంబాన్ని పరామర్శించారు. ధైర్యం చెప్పి, ఆర్థికసాయం అందజేశారు. మాలో ఆత్మవిశ్వాసం నింపారు. గ్రామంలో మాకున్న రెండు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని బంగారమ్మపాలేనికి చెందిన దొడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించే సత్తా ఆయనకు మాత్రమే ఉందన్నారు.  

>
మరిన్ని వార్తలు