రాజన్నకు నీరాజనం

3 Sep, 2018 12:43 IST|Sakshi
వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతున్న మేరుగ నాగార్జున, పక్కన పార్టీ నాయకులు కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు, గౌతంరెడ్డి, వెలంపల్లి తదితరులు

వాడవాడలా మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి

వైఎస్సార్‌ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి

జిల్లావ్యాప్తంగా అన్నదానాలు, రక్తదాన, వైద్య శిబిరాలు

రాజన్న కాలం నాటి స్వర్ణయుగాన్ని స్మరించుకున్న ప్రజలు

మళ్లీ ఆనాటి పాలన కావాలంటున్న జనం

విజయవాడ సిటీ: మరపురాని మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతిని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆదివారం గ్రామగ్రామాన నిర్వహించారు.  వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు. వైఎస్సార్‌ నాటి స్వర్ణయుగాన్ని తలచుకుని సంతోషించారు. మళ్లీ ఆనాటి పాలన రావాలని కోరుకున్నారు.

పెనమలూరులో...
పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ వర్థంతి ఘనంగా జరిగింది. యనమలకుదురు, కానూరు, పోరంకి, పెనమలూరు, గోసాల, వణుకూరు, ఈడుపుగల్లు, కంకిపాడు, గొడవర్రు, పునాదిపాడు, నెప్పల్లి, చలివేంద్రపాలెం, కుందేరు గ్రామాల్లో కార్యక్రమాలకు మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, జెడ్‌పీ ఫ్లోర్‌లీడర్‌ తాతినేని పద్మావతి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

అవనిగడ్డలో
అవనిగడ్డ నియోజకవర్గంలో లో పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌ఆర్‌ఐ వికాస్‌ హైస్కూల్‌లో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

మైలవరంలో....
మైలవరం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త వసంత కృష్ణ ప్రసాద్‌ ఆధ్వర్యంలో  ఇబ్రహీంపట్నం మండలంలో వైఎస్‌ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.

మచిలీపట్నం, పామర్రులో...
మచిలీపట్నంలో జిల్లా కోర్టు ప్రాంగణంలోని వైఎస్సార్‌ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే, పార్టీ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య (నాని), నివాళులర్పించి, జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు.  పామర్రులో నియోజకవర్గ సమన్వయకర్త కైలే అనీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  

గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో....
గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడాలి నాని వైఎస్సార్‌ విగ్రహానికి ఘన నివాళి అర్పించారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గన్నవరం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు నేతృత్వంలో ప్రసాదంపాడులో  మహానేతకు ఘననివాళులర్పించడంతో పాటు ఏడు వేల మందికి అన్నదానం, ఇతర గ్రామాల్లో ఆల్పహారం పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పండ్ల వ్యాపారులకు ఆయన తోపుడు బండ్లు పంపిణీ చేశారు.

నూజివీడులో...
నూజివీడు పట్టణంలోని చిన్నగాంధీబొమ్మ సెంటర్‌లో నిర్వహించిన వైఎస్‌ వర్ధంతి కార్యక్రమంలో నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ చిత్రపఠానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

తిరువూరులో..
దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్థంతి కార్యక్రమాన్ని ఆదివారం తిరువూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు.  మునుకుళ్ళలో పెద్ద ఎత్తున అన్నదానం చేశారు.

కైకలూరులో....
కైకలూరు నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరెడ్డి వర్ధంతి కార్యక్రమం ఆదివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కైకలూరు,  కైకలూరు సంతమార్కెట్‌ వద్ద 23 అడుగుల భారీ వైఎస్‌ విగ్రహం వద్ద డీఎన్నార్‌ ఆధ్వర్యంలో పూలమాలు వేసి నివాళి అర్పించారు.

 పెడనలో...
పెడనలో పార్టీ సమన్వయకర్త జోగి రమేష్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు.
విజయవాడ తూర్పు, పశ్చిమం,

సెంట్రల్‌లో...
విజయవాడ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త యలమంచిలి రవి ఆధ్వర్యంలో మహానేతకు నివాళి అర్పించడం తో పాటు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాస్‌ ఆ«ధ్వర్యంలో వైఎస్సార్‌ వర్థంతిని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సెంట్రల్‌ నియోజవవర్గంలో వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మహానేత విగ్రహాలకు పూలమాలలు వేసి  నివాళులర్పించారు. పేదలకు పండ్లు పంపిణీ చేశారు. సింగ్‌నగర్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.

నందిగామలో....
నందిగామ నియోజకవర్గ వ్యాప్తంగా మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి 9 వ వర్ధంతి కార్యక్రమాలు సమన్వయకర్త ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ప్రతి గ్రామంలోను మహానేత విగ్రహాలు, చిత్ర పటాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నందిగామ, కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో పలుచోట్ల జరిగిన కార్యక్రమాల్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ మొండితోక అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

జగ్గయ్యపేటలో..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ యూత్‌ నాయకుడు సామినేని వెంకట కృష్ణప్రసాద్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు.

మహావ్యక్తి డాక్టర్‌ వైఎస్సార్‌
పార్టీలు, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ బాగుచేయాలనే కలలుగన్న ఏకైక మహానేత దివంగత ముఖ్యమంత్రి  డాక్టర్‌ వైఎస్‌ రాజÔóఖర్‌రెడ్డి వర్థంతిని పురస్కరించుకొని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వైఎస్‌ రాజశేర్‌రెడ్డి విగ్రహానికి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మేరుగు నాగార్జున, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సెంట్రల్‌ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ  నగర పార్టీ అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లాది విష్ణు, రాష్ట్ర అధికార ప్రతినిధి పైలా సోమినాయుడు, ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అ«ధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి పూలమాలలు వేసి రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకున్నారు.

వైఎస్సార్‌ చిరస్మరణీయుడు...
ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మేరుగు నాగార్జన మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిరస్మరణీయులన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమాన్ని, అభివృద్థిని రెండు కళ్లతో నడిపిన వ్యక్తి వైఎస్సార్‌ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనార్టీలు, రైతులు, విద్యార్థులు, యువకులు, వృద్థులు, వికలాంగులు, ఉన్నత కులాల్లో పేదవారి అభివృద్దే, రాష్ట్ర అభివృద్థి అని తలచి పరిపాలించిన మహావ్యక్తి  డాక్టర్‌ వైఎస్సార్‌ అన్నారు.

డాక్టర్‌ అనే పదానికి సార్థకత...
కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్‌   వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని ప్రతి పేదవాడు వారి ఇంటిలో తండ్రిగానో, సోదరునిగానో భావిస్తూ జరుపుకుంటున్నారంటే ఆయన వారి గుండెల్లో ఎంతగా నిలిచి ఉన్నారో అర్ధమవుతోందన్నారు. డాక్టర్‌ అనే పదానికి సార్థకత చేకూర్చిన  వ్యక్తి డాక్టర్‌ వైఎస్‌ రాజశేర్‌రెడ్డి అని అన్నారు. సమాజంలో పేద వర్గాలవారు   ఎదుర్కొంటున్న అసమానతలు,,  సమస్యలు గట్టెక్కాలంటే విద్య, వైద్యం అందించడం ఒక్కటే మార్గం అని  గుర్తించిన రాజశేర్‌రెడ్డి  ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.

సంక్షేమ రాజ్యం స్థాపించినమహనీయుడు....
నగర మర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లాది విష్ణు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఒక సంక్షేమ రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబంలో  ఓ పెద్ద కొడుకుగా చూపించిన ఔదార్యం  ఎన్నడూ మరచిపోలేమని అన్నారు. పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అ«ధ్యక్షుడు పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్‌ వర్థంతిని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారన్నారు. పేదప్రజలకు వైఎస్‌ తన పరిపాలన ద్వారా చేరువయ్యారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొప్పన భవకుమార్, సంయుక్త కార్యదర్శులు అడపాశేషు, చందన సురేష్, మైలవరపు దుర్గారావు, కాలే పుల్లారావు, ఎంవీఆర్‌ చౌదరి, అదనపు కార్యదర్శులు తోట శ్రీనివాస్, ప్రొఫెసర్‌ ఎం.పద్మారావు, విజయవాడ పార్లమెంట్‌ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు కట్లా మల్లేశ్వరరావు, ఎస్సీ సెల్‌ తోకల శ్యామ్, రాష్ట్ర ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి మేడా రమేష్‌ , డాక్టర్‌ సెల్‌ విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ మహబూబ్‌ షేక్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి, కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ బండి నాగపుణ్యశీల, కార్పొరేటర్లు చోడిశెట్టి సుజాత, కావటి దామోదర్, ప్రచార విభాగం నగర అ«ధ్యక్షుడు పోతిరెడ్డి సుబ్బారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తుమ్మల చంద్రశేఖర్‌ (బుడ్డి), తంగిరాల రామిరెడ్డి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పిల్లి కృష్ణవేణి, నగర సేవాదళ్‌ అ«ధ్యక్షుడు అక్కిపెద్ది శ్రీనివాస్, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిరాల ప్రభాకర్, నగర అధికార ప్రతినిధి మనోజ్‌ కొఠారి పాల్గొన్నారు.

దివిసీమలో మెగా రక్తదాన శిబిరం
అవనిగడ్డ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి కార్యక్రమాన్ని దివిసీమలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కన్వీనర్‌ సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌ఆర్‌ఐ వికాస్‌ హైస్కూల్‌లో మెగా రక్తదానం, ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణ రక్తదాన శిబిరాన్ని  ప్రారంభించగా, మచిలీపట్నం నియోజకవర్గ కన్వీనర్, రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. మోపిదేవి, పేర్ని, పామర్రు నియోజకవర్గ కన్వీనర్‌ కైలే అనిల్‌కుమార్, అవనిగడ్డ కన్వీనర్‌ సింహాద్రి రమేష్‌బాబు తదితరులు మహానేత వైఎస్సార్‌ చిత్రపటంకు పూలమాల వేసి నివాళులర్పించారు.  315 మంది రక్తదానం చేయగా, 2500 మందికి ఉచిత వైద్యసేవలు అందించినట్టు సింహాద్రి చెప్పారు. మహానేత స్ఫూర్తితో ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు .

మరిన్ని వార్తలు