‘జగన్‌ లాంటి సీఎం ఉంటే కళ్లజోడు వచ్చేది కాదు’

10 Oct, 2019 13:14 IST|Sakshi

పేర్ని నాని

సాక్షి, కృష్ణా : మచిలీపట్నం గిలకలదిండి మున్సిపల్ స్కూల్లో మంత్రి పేర్నినాని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌తో కలిసి వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థి ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి పేర్కొన్నారు. తన చినన్నప్పుడే వైఎస్‌ జగన్‌ లాంటి ముఖ్యమంత్రి ఉండి వుంటే ఇప్పుడు తనకు కళ్ళజోడు లేకపోయేదని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వ్యాఖ్యానించారు.

అలాగే పామర్రు జడ్పీ హైస్కూల్లో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ 'వైఎస్సార్ కంటివెలుగు' కార్యక్రమాన్ని ప్రారంభించగా, కార్యక్రమంలో కాకర్ల వెంకటేశ్వరరావు, ఆరుమళ్ళ శ్రీనాధరెడ్డి, దేవిరెడ్డి బాలవెంటేశ్వరరెడ్డి, ఆరేపల్లి శ్రీనివాసరావు, కొచ్చెర్ల శ్రీనివాసరావు, పెయ్యేల రాజు, నవుడు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. పెనమలూరు నియోజకవర్గం కానూరు జడ్పీ హైస్కూలులో వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమాన్ని శాసనసభ్యుడు కొలుసు పార్థసారధి, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత ప్రారంభించారు. జడ్పీటిసి సభ్యురాలు తాతినేని పద్మావతి, స్థానిక ఎంపీటీసీ సభ్యులు ఛాన్ బాషా కార్యక్రమంలో పాల్గొన్నారు.  మైలవరం మండలం పొందుగల గ్రామం మండల పరిషత్ పాఠశాలలో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు. గ్రామంలో  ఏర్పాటు చేసిన నూతన గ్రామ సచివాలయాన్ని కూడా ఆయన ప్రారంభించారు.

ఎమ్మెల్యేకు సన్మానం
రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ వాహనమిత్ర పథకం ద్వారా 10 వేలు ఆర్థిక సహాయాన్ని అందించడంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ కూచిపూడిలో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌ను ఆటో యూనియన్ వర్గాలు ఘనంగా సన్మానించాయి.


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా