ఏపీ విధానాలను కేంద్రం ఆదర్శంగా తీసుకోవాలి

29 Dec, 2019 11:20 IST|Sakshi

వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి

సాక్షి, విశాఖపట్నం​: ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న విధానాలను కేంద్రం ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి సూచించారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపిన మహానుభావుడు సీఎం వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు. కార్మిక విధానాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని మండిపడ్డారు.కార్పోరేట్‌ సంస్థలకు అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా కేంద్రం ఆలోచనలున్నాయని విమర్శించారు. కనీస వేతనాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

కార్మిక వ్యతిరేక విధానాలపై జనవరి 8న పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకి పిలుపునిచ్చారు. సమ్మెలో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొనాలని విజ్ణప్తి చేశారు. కార్మికులకి 21 వేల కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఉండాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను పోస్కోకి కట్టబెట్టడం దారుణమని గౌతంరెడ్డి మండిపడ్డారు.


 

మరిన్ని వార్తలు