వైఎస్సార్‌సీపీ నేత సత్యారావు మృతి 

28 Sep, 2019 04:57 IST|Sakshi
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత బలిరెడ్డి సత్యారావు

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: విశాఖపట్నం బీచ్‌రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత బలిరెడ్డి సత్యారావు (83) మృతి చెందారు. సాయంత్రం వాకింగ్‌ చేసేందుకు వెళుతుండగా వెనుక నుంచి బైక్‌ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ సత్యారావును స్థానికులు మహారాణిపేటలోని ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందారు. సత్యారావుకు భార్య, నలుగురు కుమార్తెలున్నారు. ఆయన మృతితో విశాఖ జిల్లా చోడవరం మండలం పీఎస్‌పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.

1962లో పంచాయతీ వార్డుమెంబర్‌గా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1981–86 వరకు రావికమతం సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో మొదటిసారి చోడవరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున శాసనసభకు ఎన్నికై.. రాష్ట్ర మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో రెండోసారి శాసన సభకు, 2005లో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2012లో వైఎస్సార్‌సీపీలో చేరి పార్టీకి ఎనలేని సేవలందించారు.  

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంతాపం  
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మృతి పట్ల సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజలకు సత్యారావు ఎనలేని సేవలందించారని కొనియాడారు. విశాఖ జిల్లాకు.. ముఖ్యంగా చోడవరం నియోజకవర్గానికి ఆయన మృతి తీరని లోటన్నారు. కాగా, సీఎం శనివారం విశాఖలో సత్యారావు  భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వర్ల రామయ్యకు నెల గడువిచ్చిన ప్రభుత్వం

జాషువా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

పండగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

మూఢాచారాలపై తిరగబడ్డ ‘గుర్రం’

బలిరెడ్డి కుటుంబానికి సీఎం జగన్‌ పరామర్శ

అతివలకు అండగా 181

పాన్‌–ఆధార్‌ లింక్‌ చేశారా?

విద్యుత్‌ సమస్యలకు చెక్‌

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం

2న గ్రామ సచివాలయాలు ప్రారంభం

ఫలించిన పోరాటం!

మంగళగిరి నియోజకవర్గానికి మహర్దశ !

ఎనిమిది పదులు దాటినా తరగని ఉత్సాహం

పోటెత్తిన యువత

విశాఖ బయల్దేరి వెళ్లిన సీఎం జగన్‌

విద్యుత్‌  విషాదం

1న వలంటీర్లకు గౌరవ వేతనం

దివికేగిన దిగ్గజం.. రాజకీయ ప్రస్థానం

జిల్లాకు కొత్త పోలీస్‌ బాస్‌లు

వినూత్న ఆలోచనలకు వేదిక మోహన మంత్ర

జిల్లాలో వెల్లివిరిసిన క్రికెటోత్సాహం

వలసలు షురూ..

అక్రమాలకు ఖాకీ సాయం!

తుది దశకు పోస్టుల భర్తీ

గ్రేడ్‌–5 మెరిట్‌ లిస్ట్‌ తయారీలో ఆలస్యం

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు

అతివలకు ఆసరా

ఏపీపీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పులు

ప్రభుత్వ సలహాదారుగా రామచంద్రమూర్తి

కడలి వైపు కృష్ణమ్మ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమలా ఏమిటీ వైరాగ్యం!

అమ్మడు..కాపీ కొట్టుడు!

మనుషులా? దెయ్యాలా?

సీక్వెల్‌ షురూ

సెలవుల్లోనూ వర్కవుట్‌

జీవితం ప్రతి రోజూ నేర్పుతుంది