కులచిచ్చు రేపుతున్న చంద్రబాబు

6 Jul, 2015 01:52 IST|Sakshi
కులచిచ్చు రేపుతున్న చంద్రబాబు

భూమా నాగిరెడ్డిపై  కేసులు పెట్టడం దారుణం
చంద్రబాబుకు తొత్తులుగా పోలీసులు

 
 తిరుపతి మంగళం : కులమత భేదాలు లేకుండా అందరూ అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉన్న వారి మధ్య చంద్రబాబు కు లచిచ్చు రేపుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వా మి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతుంటే అదేమిటని ప్ర శ్నించిన కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై అక్రమ కేసులు పెట్టించడం దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు. జిల్లాలో పెద్దదిక్కు గా ఉన్న భూమా నాగిరెడ్డిని జైలుకు పంపితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవొచ్చన్న దురాలోచనతో చంద్రబాబు కు ట్రపన్నారని తెలిపారు.

తమ పార్టీ అ ధ్యక్షులు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అంసెంబ్లీలో ప్రభుత్వ తీ రును నిలదీస్తే టీడీపీలోని దళిత మం త్రులు, ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించే నీచ సంస్కృతి చంద్రబాబుదన్నారు. కులాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికార దాహంతో పిల్లనిచ్చి చేరదీసిన ఎన్టీఆర్‌నే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని గుర్తుచేశారు. కర్నూలు జిల్లాలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా భూమానాగిరెడ్డిపై వేధింపుల పర్వం కొనసాగుతూనే వస్తోందన్నారు. కర్నూలులో పోలీసులు కూడా చంద్రబాబుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయ న ఆరోపించారు. భూమా నాగిరెడ్డిపై పెట్టిన కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.
 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా