బాబూ.. బీసీ మ్యానిఫెస్టో ఎక్కడ?

21 Nov, 2017 06:21 IST|Sakshi

సీఎంకు బీవై రామయ్య ప్రశ్న   

కర్నూలు (టౌన్‌): లేనిపోని హామీలతో గత ఎన్నికల్లో లబ్ధి పొందిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత బీసీల మ్యానిఫెస్టోను తుంగలో తొక్కారని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు బి.వై. రామయ్య విమర్శిం చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  ‘అధికారం చేపట్టి నాలుగేళ్లు కావస్తున్నా  బీసీ కులాలు, ఫెడరేషన్లను పట్టించుకున్న పాపానా పోలేదు. మహానేత వైఎస్సార్‌ సీఎంగా ఉన్న సమయంలో ఫెడరేషన్లకు బీజం వేశారు. ఆయన మరణం తరువాత బడుగు బలహీన వర్గాలను పట్టించుకునే వారు లేరు.

 బోయలు, రజకులు, వడ్డెరులను ఎస్టీలుగా, కాపులను బీసీలుగా, మరికొన్ని కులాలను మరోలా మారుస్తామంటూ సీఎం చంద్రబాబు కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఫెడరేషన్లు ఏర్పాటు చేసి రూ. 10 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన ఆయన నాలుగేళ్లలో రూ.4వేల కోట్లు కూడా ఇవ్వలేదు.  అబద్ధాలు చెప్పడం, దగా చేయడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకే సాధ్యం. పాదయాత్ర తరువాత వైఎస్‌ జగన్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తారు. చంద్రబాబు తరహాలో 500 పేజీలు కాకుండా రెండు పేజీల్లో పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు ఏవిధమైన న్యాయం చేస్తామో వెల్లడిస్తారు’ అని ప్రకటించారు. హుస్సేనాపురంలో ఎమ్మెల్యే రోజా సదస్సుకు తరలి వస్తున్న మహిళలను ఇబ్బందులకు గురిచేయడం దారుణమని బీవీ రామయ్య అన్నారు.

 సదస్సుకు మహిళలు రావడం నేరమా ..అని ప్రశ్నించా రు. ప్రజలకు అవకాశం ఇస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్‌ పాదయాత్రలకు జనం లేరని సోమిశెట్టి చెప్పడం హాస్యాస్పదమన్నారు.  అన్నం తినే వాళ్లెవరూ ఇలా మాట్లాడరన్నారు. గది  నుంచి బయటకు రాకుండా ప్రెస్‌మీ ట్లు పెట్టే నీకు కళ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చీము, నెత్తురుంటే  పాదయాత్ర వద్దకు వచ్చి జనం ఉన్నదీ లేనిదీ తెలుసుకోవాలని సూచించారు.  

మరిన్ని వార్తలు