బాబూ! ఇక నీ భూదోపిడీ సాగదు

25 Apr, 2017 00:34 IST|Sakshi
బాబూ! ఇక నీ భూదోపిడీ సాగదు

- వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి
- కోర్టు తీర్పే సర్కార్‌కు చెంపపెట్టు


సాక్షి, హైదరాబాద్‌: రాజన్న వారసులుగా, జగనన్న సైనికులుగా రాజధానిలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ పేద ప్రజలకు అన్యాయం జరిగినా ప్రభుత్వంపై దండెత్తేందుకు ఏమా త్రం వెనుకాడబోమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశా రు. రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న భూదోపిడీకి రాష్ట్ర హైకోర్టు అడ్డుకట్ట వేయడం స్వాగతించదగ్గ పరిణామమన్నారు. హైకోర్టు ఆదేశాలతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని, రైతుల భూములను బలవంతం గా లాక్కునే అప్రజాస్వామిక చర్యలు మాను కోవాలని హితవు పలికారు.

పెనుమాక భూసేకరణ నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ, యథాతథ స్థితి (స్టేటస్‌కో) కొనసాగించాలని హైకోర్టు సోమవారం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో  మీడియాతో మాట్లా డుతూ.... రైతన్న వ్యవసాయ పనులు యథా తథంగా కొనసాగించుకునేందుకు న్యాయ స్థానం స్పష్టంగా తీర్పునివ్వడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. వేలాది ఎకరాలు రైతులనుంచి లాక్కున్నారని, అందు లో ఒక్క శాతమైన రాజధాని నిర్మాణానికి వినియోగించారా..? అని నిలదీశారు.

భయపెట్టడం వల్లే కోర్టుకు
ఈనెల 11న పెనుమాక గ్రామానికి సంబం ధించి 660 ఎకరాలకు ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్‌ ఇచ్చిందని, దీనిపై రైతుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చిందని ఆర్కే గుర్తుచేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం వెళితే ఇబ్బందులు వస్తాయని అడ్డదారిలో రైతులను మోసం చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. పంటలు తగలబెట్టి, రైతన్నను అన్ని విధాలా హింసించి  ప్రభుత్వం వేధింపులకు పాల్పడిం దని గత సంఘటనలను గుర్తు చేశారు. ఇప్పటికైనా న్యాయస్థానం తీర్పుకు లోబడి రైతన్న అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ భూసేకరణ చేయలేరు
మంగళగిరి (మంగళగిరి): రాజధాని భూస మీకరణకు భూములు ఇవ్వడం ఇష్టంలేని రైతులు కోర్టులను ఆశ్రయించి కోర్టు ఆదేశా లతో వ్యవసాయం చేసుకుంటుండగా, పైగా భూములకు సంబంధించిన అంశం కోర్టులో ఉండగా ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేయడం అంటే చట్టాన్ని దుర్వినియో గం చేయడమేనని ఆర్కే మండిపడ్డారు. మం డలంలోని కురగల్లు, నవులూరు గ్రామాల పరిధిలో రాజధాని భూసమీకరణకు భూము లు ఇవ్వని రైతులకు భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేయడంపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ భూసేకరణ చేయలేదని స్పష్టంచేశారు.

మరిన్ని వార్తలు