గొప్ప ఆసరా అమ్మ ఒడి

19 Mar, 2019 15:01 IST|Sakshi

సాక్షి, పెంటపాడు: తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ప్రతీ తల్లిదండ్రులు తాపత్రయపడతారు. కూలీ నాలీ చేసుకొనైనా పిల్లలను ఉన్నత స్థానంలో చూడాలని కలలు కంటారు. వారి ఆశలకు గండి కొడుతూ ప్రస్తుత ప్రైవేటు విద్య చాలా ఖరీదైపోయింది. సామాన్యులకు అది అందని ద్రాక్షలా ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల్లో భాగంగా అమ్మఒడి పథకాన్ని ప్రకటించారు. జగన్‌ తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి బాటలోనే పేదపిల్లల పట్ల జాలి ఉన్న నేత. పిల్లల చదువుకు అధిక ప్రాధాన్యత  ఇస్తూ, వారి చదువు బాల్యంలోనే ఆగిపోకూడదనే ఉద్దేశంతో ప్రాథమిక స్థాయి నుంచే చేయూత అందిస్తున్నారు. 


పేదలకెంతో ఉపయోగకరం..
పేదింటి పిల్లల చదువుకు ఏడాదికి రూ. 15 వేలు తల్లి బ్యాంకు ఖాతాలో జమచేస్తానని ఇచ్చిన హామీపై నియోజకవర్గంలోని తల్లిదండ్రుల నుంచి హర్షం వ్యక్తవుతోంది. గూడెం పట్టణం, మండలంలోని 32, పెంటపాడు మండలంలోని 21 గ్రామాలలో సుమారు 25 వేల మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. నియోజవర్గంలో 1 నుంచి 10వ తరగతి వరకు 190 ప్రాథమిక పాఠశాలు, మరో 70కి పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. బాల్యవివాహాలు, బడి మాన్పించడం, పేదరికం వల్ల చదువుకు స్వస్తిపలకడం వంటివి చేస్తున్నారు. ఈ సమయంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రాగానే ఈ పథకం ద్వారా రూ. 15 వేలు వారి చదువుకు ఎంతో ఆసరాగా ఉంటుంది. టీడీపీ ప్రభుత్వంలో సంక్షేమ వసతి గృహాలను క్రమంగా మూసివేస్తోంది. క్రమ బద్ధీకరణ పేరుతో పలు పాఠశాలలను ఇప్పటికే మూసివేసారు. జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వస్తే వాటిని పునరుద్ధరించడమే కాకుండా పిల్లలు చదువులు మానేయకుండా ఈ పథకం ఉపయోగపడుతుందని తల్లిదంర్రులు భావిస్తున్నారు.  కాగా ఈ సమయంలో పేదలు చదువుకుంటే దేశం బాగుపడుతుందని, జగన్‌ ఇచ్చిన ఆసరా పేదలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని పలువురు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


‘అమ్మఒడి’ పేదలకు వరం..
ఈ పథకం అమల్లోకి వస్తే పేదపిల్లలు ఉత్సాహంగా చదువుకొంటారు. ఫీజు  రియింబర్స్‌మెంట్‌ ద్వారా అలనాడు రాజశేఖరరెడ్డి విద్యార్థుల గుండెల్లో కొలువైనాడు. జగన్‌ పథకం కూడా అలాంటి ఫలితాలే అందిస్తుంది.
-గొర్రెల కోటేష్, పరిమెళ్ల


రాష్ట్రంలో అక్షరాస్యత పెరుగుతుంది..
ఉన్నత లక్ష్యంతో ప్రవేశపెట్టిన ‘అమ్మఒడి’ పథకంతో రాష్ట్రంలో అక్షరాస్యత గణనీయంగా పెరుగుతుంది. ప్రాథమిక స్థాయిలో ఇటువంటి పథకం వల్ల ఎంతో లబ్ధి చేకూరుతుంది. చదువులో కేరళ రాష్ట్రాన్ని అధిగమించే అవకాశం ఉంది.
-దేవరశెట్టి రాంబాబు, కొండేపాడు 

>
మరిన్ని వార్తలు