శ్రీకాకుళం జిల్లా: వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వివరాలు

18 Mar, 2019 11:32 IST|Sakshi

జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఖరారయ్యారు. వీరిలో కొందరు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు కాగా, మరికొందరు తొలిసారి పోటీ చేస్తుండటం విశేషం. వీరి వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. 

శ్రీకాకుళం      ధర్మాన ప్రసాదరావు
స్వగ్రామం    : మబగాం, నరసన్నపేట మండలం
కుటుంబ నేపథ్యం    :  భార్య గజలక్ష్మి. కుమారుడు రామమనోహర్‌నాయుడు 
రాజకీయ నేపథ్యం    : 1981లో మబగాం సర్పంచ్‌గా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1982లో యువజన కాంగ్రెస్‌ అధ్యక్షునిగా, 1987లో పోలాకి మండల తొలి అధ్యక్షునిగా, జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షునిగా వ్యవహరించారు. 1994లో ఏఐసీసీ సభ్యునిగా పనిచేశారు. 1989, 1999లలో నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమెల్యేగా ఎన్నికయ్యారు. నేదురుమల్లి జనార్థనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికలలో శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై  రెవెన్యూ వ్యవహరించారు. 2013లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌గా, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. 
 

రాజాం   కంబాల జోగులు
పదవి :    రాజాం ఎమ్మెల్యే
స్వగ్రామం :     మంగళాపురం, రాజాం 
రాజకీయ రంగప్రవేశం: 1999లో పాలకొండ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్‌కు ప్రయత్నించారు. 2004లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2009లో రాజాం నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో రాజాంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచారు.
వ్యక్తిగతం :   నిత్యం ప్రజల్లో ఉండడం. వివాదాలకు దూరంగా ఉండటం. ప్రతి కార్యక్రమానికి హాజరుకావడం. 
అభిరుచులు :  క్రీడలంటే ఇష్టం, వాలీబాల్‌ పోటీల్లో చాంపియన్‌.
కుటుంబ నేపథ్యం:  తల్లిదండ్రులు ఆదమ్మ, గవరయ్య. నలుగురు సోదరులు. ఇద్దరు అక్కాచెల్లెల్లు.
విద్యార్హతలు : బీఏ బీఎల్‌( 7వ తరగతి వరకూ శ్రీకాకుళంలోని ఎస్‌ఎంయూపీ స్కూల్‌. ఇంటర్, డిగ్రీ శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్‌ డిగ్రీ కళాశాల. విశాఖపట్నంలోని ఆల్‌సైన్సు క్రిస్టియన్‌ లా క«ళాశాలలో బీఎల్‌ చదివారు. 

 పాతపట్నం       రెడ్డి శాంతి 
విద్యార్హత            :  డిగ్రీ
రాజకీయ నేపథ్యం: 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటి నుంచి జిల్లాలోను, పాతపట్నం నియోజక వర్గంలోను చురుగ్గా జాసమస్యలపై పోరాటం          చేస్తున్నారు.
కుటుంబ నేపథ్యం: రెడ్డి శాంతి తాత పాలవలస సంగంనాయుడు 3 సార్లు, నాన్నమ్మ రుక్మిణమ్మ ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. తండ్రి పాలవలస రాజశేఖరం పాలకొండ సమితి అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, జిల్లా  పరిషత్‌ చైర్మన్గా, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షునిగా, రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. 

టెక్కలి          పేరాడ తిలక్‌ 
విద్యార్హతలు:     బీఏ(శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ)
కుటుంబ నేపథ్యం: పేరాడ భార్గవి ( ప్రస్తుతం పలాస జెడ్పీటీసీ), ఇద్దరు కుమారులు పేరాడ దుష్యంత్, పేరాడ శరత్‌ 
రాజకీయ నేపథ్యం:  సీనియర్‌ రాజకీయ నాయకుడు మాజీ ఎంపీ కణితి విశ్వనాథం శిష్యునిగా 1990  నుంచి రాజకీయాల్లో చురుగ్గా పనిచేశారు. 2007లో నందిగాం మండలం పెద్దలవునిపల్లి ఎంపీటీసీగా గెలుపొంది నందిగాం వైస్‌ ఎంపీపీగా పనిచేశారు. 2012లో డీసీసీబీ డైరక్టర్‌గా పనిచేశారు. 2013లో వైఎస్సార్‌ సీపీలో చేరారు. 2016లో టెక్కలి నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తించారు. 2017 నుంచి నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. 

పాలకొండ        విశ్వాసరాయి కళావతి
స్వగ్రామం:  వండువ, వీరఘట్టం మండలం
విద్యార్హతలు: ఎంఏ సోషియాలజీ(ఆంధ్రా యూనివర్సిటీ)
రాజకీయ నేపథ్యం: పాలకొండ ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీచేసి టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకష్ణపై 1652 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో డిప్యూటీ మేనేజర్‌(స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా)గా పనిచేశారు. తండ్రి విశ్వాసరాయి నర్సింహదొర(వండువదొర) పార్వతీపురం ఎస్టీ నియోజకవర్గం నుంచి 1967–1972 వరకు ఎంపీగా, కొత్తూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి 1972–78 వరకు, 1978–83 వరకు జనతా పార్టీ తరఫున, 1985–89 వరకు కాంగ్రెస్‌–ఐ తరఫున ఎమ్మెల్యేగా సేవలందించారు.
సంతానం:  ఏకైక కుమార్తె. మండంగి సాయివైష్ణవి(8 సంవత్సరాలు)
అభిరుచులు:  సామాజిక సేవ, కూరగాయల పెంపకం 


ఇచ్ఛాపురం           పిరియా సాయిరాజ్‌
స్వగ్రామం:  బల్లిపుట్టుగ, కవిటి మండలం
విద్యార్హత:   మాస్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌లో ఏయూ పీహెచ్‌డీ చేస్తున్నారు
రాజకీయ నేపథ్యం: 2007లో ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేలో జడ్‌.ఆర్‌.యు.సి.సి.మెంబర్‌గా పనిచేశారు. టీడీపీ తరఫున 2009 నుంచి 2013 వరకు ఇచ్ఛాపురం శాసనసభ్యునిగా పనిచేశారు. 2013 –14లో వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ విశాఖపట్నం పార్లమెంటరీ పార్టీ పరిశీలకునిగా వ్యవహరించారు. 2014లో వైఎస్సార్‌ సీపీ జిల్లా ఎన్నికల పరిశీలకునిగా ఉన్నారు. 2014 నుంచి 2017 వరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ప్రజాసమస్యలపై పోరాడుతున్నారు.  
సేవా కార్యక్రమాలు:  ఉద్దానం ఫౌండేషన్‌ స్థాపించి సోంపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో డయాలసిస్‌ యూనిట్‌ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వచ్చిన గౌరవ వేతనాన్ని కిడ్నీబాధితులకు సాయంగా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యేగా వస్తున్న పింఛన్‌ సైతం వారికే కేటాయిస్తున్నారు. రెండు అంబులెన్స్‌లతో ఉచిత సేవలు అందిస్తున్నారు. 

 నరసన్నపేట         ధర్మాన కృష్ణదాస్‌
స్వగ్రామం: మబగాం, నరసన్నపేట మండలం
కుటుంబ నేపథ్యం: భార్య పద్మప్రియ. ఇద్దరు కుమారులు
విద్యార్హత:  బీకాం
రాజకీయ నేపథ్యం: 2004లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అంతకుముందు స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2010లో వైఎస్సార్‌ సీపీలో చేరారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో 17 వేల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి  నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు.

ఆమదాలవలస           తమ్మినేని సీతారాం
విద్యార్హత:  డిగ్రీ
స్వగ్రామం:  తొగరాం
రాజకీయ నేపథ్యం: 1977లో శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల విద్యార్థి సంఘ నాయకునిగా రాజకీయ అరంగేట్రం చేశారు.1979–80లో జిల్లా బీసి సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా, 1980లో ఆమదాలవలస కో–ఆపరేటివ్‌ సుగర్స్‌ ఫ్యాక్టరీ డైరెక్టర్‌గా, అదే ఏడాది జిల్లాస్పోర్ట్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీగా పనిచేశారు. 1983లో ఆమదాలవలస అసెంబ్లీ స్థానానికి టీడీపీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శాప్‌ వైస్‌ చైర్మన్‌గా, 1985లో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు. 1994లో న్యాయశాఖ, అదే ఏడాది చంద్రబాబు కేబినెట్‌లో పురపాలకశాఖ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా పని చేశారు.  ఆరుసార్లు పార్లమెంటుకు ఎన్నికైన బొడ్డేపల్లి రాజగోపాలరావుని సైతం 1991 ఎన్నికల్లో ఓడించి జిల్లాలోనే తిరుగులేని నాయకుడిగా పేరుపొందారు. తర్వాత కాలంలో టీడీపీ సిద్ధాంతాలు నచ్చక 2014 ఎన్నికల్లో  వైఎస్సార్‌ సీపీలో చేరారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో మేనల్లుడు కూన రవికుమార్‌ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 1996–97లో రాష్ట్ర వెయిట్‌ లిప్టింగ్‌ పోటీల్లో సత్తాచాటి మిస్టర్‌ ఆంధ్రాగా ఎంపికయ్యారు.

ఎచ్చెర్ల           గొర్లె కిరణ్‌కుమార్‌ 
స్వగ్రామం: పాతర్లపల్లి, రణస్థలం మండలం
విద్యార్హత:  బీకామ్‌
రాజకీయ నేపథ్యం: విజయనగరం ఎంఆర్‌ కాలేజీలో విద్యార్థి సంఘ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1992–93లో ఎన్‌ఎస్‌యూఐ కార్యదర్శిగా, 1997–98లో పీసీసీ సభ్యునిగా, 1999–2004లో మండల కాంగ్రెస్‌ అధ్యక్షునిగా సేవలందించారు. 2013 నుంచి ఎచ్చెర్ల నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.
కుటుంబ నేపథ్యం: తండ్రి సూర్యనారాయణ  రణస్థలం సమితి మాజీ అధ్యక్షునిగా పనిచేశారు. పెదనాన్న గొర్లె శ్రీరాములనాయుడు మంత్రిగా, 16 ఏళ్లు జెడ్పీ చైర్మన్‌గా వ్యవహరించారు. భార్య గొర్లె పరిమిల మాజీ ఎంపీపీగా పనిచేశారు. కుమారుడు తమన్‌వర్థన్‌నాయుడు.

పలాస      డాక్టర్‌ సీదిరి అప్పలరాజు
స్వగ్రామం: దేవునల్తాడ, వజ్రపుకొత్తూరు మండలం. ప్రస్తుత నివాసం పలాస–కాశీబుగ్గ
విద్యార్హతలు:  ఎంబీబీఎస్, ఎండీ జనరల్‌ మెడిసిన్‌
రాజకీయ నేపథ్యం: 2017లో వైఎస్సార్‌సీపీలో చేరారు. అప్పటి నుంచి పలాస నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.  
వృత్తి/ప్రవృత్తి:   పలాస పరిసర ప్రాంతాల్లో పదేళ్లుగా వైద్యసేవలు అందిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండటమే కాకుండా పేదలకు తక్కువ ధరలోనే వైద్యసేవలు అందించి వారి అభిమానం చూరగొంటున్నారు.  
కుటుంబ నేపథ్యం:  భార్య శ్రీదేవి. ఇద్దరు కుమారులు.

మరిన్ని వార్తలు