పేద పిల్లల ఆకలి తీర్చేందుకు నాట్స్ ముందడుగు

18 Mar, 2019 11:31 IST|Sakshi

చికాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పేద పిల్లల ఆకలి తీర్చేందుకు మేముసైతం అంటూ ముందుకొచ్చింది. నాట్స్చికాగో మహిళా బృందం 62 వేలమందికి ఆహారాన్ని సిద్ధం చేసి ఉచితంగా అందించింది. చికాగో నాట్స్ మహిళా నాయకులు రామ్ కొప్పాక, శైలజ ముమ్మనగండి, రాధ పిడికిటి, సుమతి నెప్పల్లి, లక్ష్మి కలగర, రోజా శీలంశెట్టి, కల్పన సుంకర, రాజీవ్ మన్నె, కల్యాణి కోగంటి తదితురులు ఆహారాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. 

తమకు తెలిసిన ప్రతి ఒక్కరి సహకారాన్ని కూడా తీసుకుని పేద పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేశారు. ఇలా తయారైన 62 వేల మీల్స్‌ను స్కాంబర్గ్‌లోని ఫీడ్‌ మై స్టార్వింగ్ చిల్డ్రన్‌కు నాట్స్ విరాళంగా అందించింది.

మరిన్ని వార్తలు