గ్రహం అనుగ్రహం (18-01-2020)

18 Jan, 2020 05:57 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి బ.అష్టమి ఉ.9.07 వరకు తదుపరి నవమి, నక్షత్రం స్వాతి రా.3.44 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం ఉ.10.16 నుంచి 11.47 వరకు దుర్ముహూర్తం ఉ.6.37 నుంచి 9.05 వరకు అమృతఘడియలు... రా.7.21 నుంచి 8.43 వరకు.

సూర్యోదయం :    6.38
సూర్యాస్తమయం    :  5.42
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

వృషభం: పనుల్లో ఊహించని విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

మిథునం: ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.

కర్కాటకం:  రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. విచిత్రమైన సంఘటనలు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు అనుకున్న విధంగా విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

కన్య: వ్యయప్రయాసలు తప్పవు. ధనవ్యయం. కుటుంబంలో కొన్ని వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

తుల: మిత్రులతో సఖ్యత. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు సాయం అందిస్తారు. వ్యాపారాలు మరింత కలసివస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం: దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆలోచనలు నిలకడగా ఉండవు. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో కొద్దిపాటి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

ధనుస్సు: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో మరింత  గౌరవం. కీలక నిర్ణయాలు. నూతన ఉద్యోగప్రాప్తి. భూ, గృహయోగాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు ఉత్సాహంగా కొనసాగుతాయి.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయ దర్శనాలు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కుంభం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం: కొత్త రుణాలు చేస్తారు. పనులలో ఆటంకాలు. ఎంతగా కష్టపడ్డా ఫలితం ఉండదు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

– సింహంభట్ల సుబ్బారావు 

>
మరిన్ని వార్తలు