గ్రహం అనుగ్రహం (19-09-2019)

19 Sep, 2019 08:20 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువుభాద్రపద మాసం, తిథి బ.పంచమి ప.3.41 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం భరణి ఉ.6.43 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం రా.7.11 నుంచి 8.53 వరకు, దుర్ముహూర్తం ఉ.9.55 నుంచి 10.43 వరకు తదుపరి ప.2.45 నుంచి 3.52 వరకు, అమృతఘడియలు... తె.5.10 నుంచి 6.50 వరకు (లె ల్లవారితే శుక్రవారం). 

సూర్యోదయం :    5.52
సూర్యాస్తమయం  :  5.58
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

భవిష్యం

మేషం : పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం : మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మిథునం : పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

కర్కాటకం : నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్కొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

సింహం : పనుల్లో అవాంతరాలు. రు ణా లు చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో నిరాశ. దైవదర్శనాలు.

కన్య : అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. ఒప్పందాలు వాయిదా. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో గందరగోళం.

తుల : పరపతి పెరుగుతుంది. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృశ్చికం : పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

ధనుస్సు : పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు స్వల్పంగానే లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

మకరం : సన్నిహితులతో వివాదాలు. శ్ర మ తప్ప ఫలితం కనిపించదు. పనులు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందకొడి గా సాగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

కుంభం : సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. వాహనయోగం. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మార్పులు.

మీనం : శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్య సూచనలు. ఉద్యోగ యత్నాలలో ఆటంకాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.
– సింహంభట్ల సుబ్బారావు 

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా