గ్రహం అనుగ్రహం (31-01-2020)

31 Jan, 2020 06:07 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి శు.షష్ఠి ప.12.44 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం రేవతి ప.3.35 వరకు, తదుపరి అశ్వనివర్జ్యం... లేదు, దుర్ముహూర్తం ఉ.8.50 నుంచి 9.35 వరకు తదుపరి ప.12.35 నుంచి 1.20 వరకుఅమృతఘడియలు... ప.12.56 నుంచి 2.44 వరకు.

సూర్యోదయం :    6.36
సూర్యాస్తమయం    :  5.51
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం: సోదరులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

వృషభం: మిత్రులు సహకరిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పైచేయి మీదే.

మిథునం: సన్నిహితుల సలహాలు పాటిస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.

కర్కాటకం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. బంధువుల కలయిక. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

సింహం: వ్యయప్రయాసలు. మిత్రులు, కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

కన్య: పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం. పనులు కొన్ని సకాలంలో పూర్తి చేస్తారు. భూ, వాహనయోగాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

తుల: చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

వృశ్చికం: పనుల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్యం మందగిస్తుంది. బంధుమిత్రులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.

ధనుస్సు: అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం: కొత్తమిత్రుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వాహనయోగం. పోటీపరీక్షల్లో విజయం. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి.

కుంభం: వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

మీనం: సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు