గ్రహం అనుగ్రహం (25-02-2020)

25 Feb, 2020 06:17 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువుఫాల్గుణ మాసం, తిథి శు.విదియ రా.11.35 వరకు, తదుపరి తదియ నక్షత్రం పూర్వాభాద్ర సా.5.35 వరకు, తదుపరి, ఉత్తరాభాద్రవర్జ్యం రా.11.47 నుంచి 1.33 వరకు, దుర్ముహూర్తం ఉ.8.44నుంచి 9.30 వరకు, తదుపరి రా.10.58 నుంచి 11.47 వరకు అమృతఘడియలు... ఉ.8.45 నుంచి 10.32 వరకు.

సూర్యోదయం :    6.26
సూర్యాస్తమయం    :  6.01
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంతమేర అనుకూలిస్తాయి.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలోవిజయం. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

మిథునం: యత్నకార్యసిద్ధి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

కర్కాటకం: శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

సింహం: వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొద్దిపాటి చికాకులు.

కన్య: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

తుల: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. ఆస్తిలాభ సూచనలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృశ్చికం: శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. సోదరులు,సోదరీలతో వివాదాలు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

ధనుస్సు: సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కుంభం: కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. అనారోగ్యం.

మీనం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆస్తిలాభం. సోదరులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. విందువినోదాలు.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు