గ్రహం అనుగ్రహం (30-01-2020)

30 Jan, 2020 06:22 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువుమాఘ మాసం, శు.పంచమి ఉ.10.35 వరకు, తదుపరి షష్ఠినక్షత్రం ఉత్తరాభాద్ర ప.1.04 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం రా.2.20 నుంచి 4.04 వరకు, దుర్ముహూర్తం ఉ.10.20నుంచి 11.06 వరకు, తదుపరి ప.2.50 నుంచి 3.34 వరకుఅమృతఘడియలు... ఉ.7.43 నుంచి 9.29 వరకు.

సూర్యోదయం :    6.37
సూర్యాస్తమయం    :  5.50
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలబ్ధి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊరట లభిస్తుంది.

మిథునం: వాహనయోగం. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కర్కాటకం: పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. ఒప్పందాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

సింహం: బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

కన్య: కొత్త పనులు చేపడతారు. ఆస్తి, ధనలాభాలు. ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

తుల: సన్నిహితులతో సఖ్యత. కొన్ని వివాదాలు తీరతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృశ్చికం: పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

ధనుస్సు: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. విద్యార్థులకు ఒత్తిడులు.

మకరం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. ఊహించని ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగమార్పులు.

మీనం: పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలబ్ధి. ఆస్తులు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు.– సింహంభట్ల సుబ్బారావు

>
మరిన్ని వార్తలు