ఈ ఏడాది 1,500 కొత్త మొబైల్స్

20 Feb, 2015 01:31 IST|Sakshi
ఈ ఏడాది 1,500 కొత్త మొబైల్స్

91మొబైల్స్‌డాట్‌కామ్ వెల్లడి
న్యూఢిల్లీ:  ఈ ఏడాది భారత్‌లో 1,400-1,500 వరకూ కొత్త మొబైల్ ఫోన్ మోడళ్లు రానున్నాయని 91మొబైల్స్‌డాట్‌కామ్ తెలిపింది. షియోమి, ఆసుస్, మోటొరొలా, ఒబి వంటి కంపెనీలు భారత్‌లో తమ మార్కెట్ వాటా పెంచుకునే ప్రయత్నాలు చేస్తుండడమే దీనికి కారణమని 91మొబైల్స్‌డాట్‌కామ్‌కు చెందిన మాధుర్ వివరించారు. గత ఏడాది వచ్చిన కొత్త మోడళ్లు(1,137)తో పోల్చితే ఇది 20 శాతం అధికమని పేర్కొన్నారు.

2013లో 957 కొత్త మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయని తెలిపారు. షియోమి, ఆసుస్, మోటొరొలా, ఒబి తదితర కంపెనీలు వివిధ ధరల రేంజ్‌లో వివిధ ఫీచర్లున్న ఫోన్‌లను అందిస్తున్నాయని మాధుర్ వివరించారు. రెండోసారి, మూడోసారి స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు చేసేవాళ్లు  హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల వైపు మళ్లుతున్నారని వివరించారు. గత ఏడాది  షియోమి,  మోటొరొలా, లెనొవొ, ఆసుస్ కంపెనీలు రూ.5,000-15,000 రేంజ్‌లో ఆధునిక ఫీచర్లున్న మొబైళ్లను అందించాయని, ఫలితంగా స్మార్ట్‌ఫోన్ సగటు విక్రయ ధర గత ఏడాది 18 శాతం తగ్గిందని పేర్కొన్నారు.  

ఇదే ధోరణి ఈ ఏడాది కూడా కొనసాగుతుందని వివరించారు.  ఈ  ఏడాది రూ.15,000-20,000 రేంజ్  ఫోన్‌లకు ఆదరణ పెరుగుతుందని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లకు సంబంధించి పరిశోధన, పోలికలను వివరించే ఈ వెబ్‌సైట్‌లో 20 వేల డివైస్‌ల వివరాలున్నాయని అంచనా. గత ఏడాది 4 కోట్ల మంది తమ వెబ్‌సైట్‌ను సందర్శించారని ఈ వెబ్‌సైట్ అంటోంది.

మరిన్ని వార్తలు