55 వేల షెల్ కంపెనీలు రద్దు

21 Sep, 2018 20:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  మనీలాండరింగ్‌, అక్రమ లావాదేవీలు జరిపుతున్న డొల్లపై కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝళిపించింది. రెండో దఫా ఏరివేతలో భాగంగా 55 వేల షెల్ కంపెనీలను   ముసుగు కంపెనీలు) రద్దు చేసినట్టు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.  ఇదే క్రమంలో విచారణలో ఉన్న మరిన్ని కంపెనీలపైనా నిర్ణయం తీసుకుంటామని కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి పి.పి.చౌదరి వెల్లడించారు. మొదటి విడతలో 2015-17 మధ్య రెండేళ్ల కాలంలో 2.26 లక్షల షెల్ కంపెనీల్ని రద్దు చేసిన కేంద్రం తాజాగా మరో 55 వేల షెల్ కంపెనీలపై వేటు వేసింది.

రెండవ దశలో ఇప్పటికే 55 వేల కంపెనీల నమోదును రద్దు చేశామని, అనేక కంపెనీలు దర్యాప్తులో ఉన్నాయని చెప్పారు. రెండేళ్లుగా పైనాన్షియల్ స్టేట్ మెంట్స్ గానీ వార్షిక నివేదికలు గానీ సమర్పించని 2.26 లక్షల కంపెనీలను  రద్దు చేశారు. అవి పని చేయని కంపెనీలే కాదు.. ఒకే గదిలో, ఒకే చిరునామాపై అనేక కంపెనీలు రిజిస్టరై ఉన్నట్టు గుర్తించారు. అలాంటివాటిలో 400 పైగా బోగస్ కంపెనీలు ఉన్నాయని మంత్రి చెప్పారు. షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్, డ్రగ్ ఫండింగ్.. ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని అనుమానించిన ప్రభుత్వం.. షెల్ కంపెనీలకు షాకిచ్చింది. ఇందుకోసం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ), ఇతర పరిశోధనా సంస్థలు రంగంలోకి దిగినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు