ఇన్ఫీలో టాప్‌-పెయిడ్‌ ఎగ్జిక్యూటివ్‌లు వీరే!

22 May, 2018 17:44 IST|Sakshi

దేశీయ రెండో అతిపెద్ద టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఎగ్జిక్యూటివ్‌లకు భారీగానే వేతనం ఇస్తోంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో తన కంపెనీ చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌, ఎండీ రంగనాథ్‌ పరిహారం 60 శాతానికి పైగా జంప్‌ అయినట్టు ఇన్ఫోసిస్‌ పేర్కొంది. అధ్యక్షుడు మోహిత్‌ జోషికి కూడా 50 శాతానికి పైగా పరిహారాలు పెరిగినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో కంపెనీలో అత్యధిక వేతనం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌లు ఎవరో ఓ సారి తెలుసుకుందాం...

సలీల్‌ పరేఖ్‌, ఇన్ఫోసిస్‌ సీఈవో... 
విశాల్‌ సిక్కా రాజీనామా అనంతరం ఇన్ఫోసిస్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన సలీల్‌ పరేఖ్‌ వార్షిక వేతనంగా రూ.18.6 కోట్లను అందుకుంటున్నట్టు తెలిసింది. దీనిలోనే వేరియబుల్‌ కాంపొనెంట్‌ కూడా ఉంది. 

ఎండీ రంగనాథ్‌, ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌ఓ...
2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌ఓగా ఉన్న రంగనాథన్‌ వేతనం గత ఆర్థిక సంవత్సరం కంటే 68 శాతం మేర పెరిగింది. ఈయన తన వేతనంగా రూ.4.7 కోట్లను పొందినట్టు కంపెనీ తెలిపింది.

మోహిత్‌ జోషి, ఇన్ఫోసిస్‌ అధ్యక్షుడు...
2017-18 ఆర్థిక సంవత్సరంలో మోహిత్‌ జోషి వేతనం 52 శాతం పెరిగింది. దీంతో ఆయన రూ.6.8 కోట్లను వేతనంగా ఆర్జించారు. 

రవి కుమార్‌, ఇన్ఫోసిస్ డిప్యూటీ సీఓఓ‌...
కుమార్‌ వేతనం 2016-17 కంటే గతేడాది 36 శాతం పెరిగింది. దీంతో ఈయన వేతనం కూడా రూ.7 కోట్లకు ఎగిసింది.

క్రిష్‌ శంకర్‌, ఇన్ఫోసిస్‌ గ్రూప్‌ హెచ్‌ఆర్‌ హెడ్‌....
శంకర్‌ 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.3.7 కోట్ల వేతనం ఆర్జించారు. 

యూబీ ప్రవీణ్‌ రావు, ఇన్ఫోసిస్‌ సీఓఓ...
రావు వేతనం 2017-18 ఆర్థిక సంవత్సరంలో 5 శాతం పెరిగి రూ.7.8 కోట్లకు ఎగిసినట్టు కంపెనీ తెలిపింది.

మరిన్ని వార్తలు