విమాన టికెట్ ధరలు పెరుగుతాయ్!

12 Nov, 2016 00:47 IST|Sakshi
విమాన టికెట్ ధరలు పెరుగుతాయ్!

ఒక్కొక్క ఫ్లైట్‌కి రూ.8,500 వరకు సుంకం విధింపు
డిసెంబర్ 1 నుంచి అమల్లోకి
రీజినల్ కనెక్టివిటీ స్కీమ్‌కు నిధుల సమీకరణే లక్ష్యం

 న్యూఢిల్లీ: విమానయానం మళ్లీ భారం కానుంది. టికెట్ ధరలు పెరిగే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (ఉడాన్) నిధుల కోసం ప్రధాన మార్గాల్లో నడిచే విమానాలపై రూ.8,500 వరకు సుంకం విధించనుంది. ఇది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. సుంకం విధింపు మొత్తం ఒక విమానానికి సంబంధించి ఉంటుంది కాబట్టి విమానంలోని సీట్ల సంఖ్యపై ఆధారపడి ప్రతి టికెట్ ధర కొంతమేర పెరుగుతుంది. విమానం ప్రయాణించే దూరాన్ని బట్టి సుంకం ఒక్కొక్క ఫ్లైట్‌కి రూ.8,500 వరకు ఉంటుందని పౌరవిమానయాన శాఖ కార్యదర్శి ఆర్.ఎన్.చౌబే తెలిపారు.

విమానంపై సుంకం.. 1,000 కిలోమీటర్ల దూరానికి రూ.7,500గా, 1,000-1,500 కిలోమీటర్ల దూరానికి రూ.8,000గా, 1,500 కిలోమీటర్ల దూరానికి రూ.8,500గా ఉంటుందని వివరించారు. ప్రధాన మార్గాల్లో నడిచే దేశీ విమానాలపై మాత్రమే ఈ సుంకం విధింపు ఉంటుందని, ప్రాంతీయ విమానాలను దీని నుంచి మినహారుుంచామని పేర్కొన్నారు. ‘సుంకం విధింపుతో రీజినల్ కనెక్టివిటీ ఫండ్‌కి రూ.400 కోట్లు జమవుతాయని అంచనా వేస్తున్నాం. ఇక మరో 20 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తారుు.

అంటే ఫండ్‌కి మొత్తంగా ఏడాదికి రూ.500 కోట్లు రావొచ్చు’ అని వివరించారు. కాగా సామాన్యుడికి విమనయానాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రీజినల్ కనెక్టివిటీ స్కీమ్‌ను ఆవిష్కరించింది. దీనికి నిధుల కోసం రీజినల్ కనెక్టివిటీ ఫండ్‌ని ఏర్పాటు చేస్తోంది. ఈ స్కీమ్ కింద ప్రయాణికులు గంట విమాన ప్రయాణానికి రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు