రూపాయి... విలవిల! | Sakshi
Sakshi News home page

రూపాయి... విలవిల!

Published Sat, Nov 12 2016 12:41 AM

రూపాయి... విలవిల!

డాలర్ మారకంలోఒకేరోజు 62పైసలు డౌన్
67.25 వద్ద ముగింపుమూడు నెలల కనిష్ట స్థారుు 

ముంబై: ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో శుక్రవారం డాలర్‌తో పోల్చితే రూపారుు విలువ 62 పైసలు బలహీనపడింది. 67.25 పైసల వద్ద ముగిసింది. ఇది మూడు నెలల కనిష్ట స్థారుు. ఈ ఏడాది ఒకేరోజు ఈ స్థారుులో రూపారుు బలహీనపడ్డం ఈ ఏడాది ఇది రెండవసారి. జూలై 26న రూపారుు 67.27 వద్ద ముగిసింది. రూపారుుని తగిన స్థారుులో నిలబెట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటు స్పాట్ ఇటు ఫార్వార్డ్ మార్కెట్‌లో జోక్యం చేసుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఒక ఫారెక్స్ ట్రేడర్ పేర్కొన్నారు.

 ట్రంప్ ఎఫెక్ట్...
అమెరికా వృద్ధే లక్ష్యమని ఆయన చేసిన ప్రకటన... అంతర్జాతీయ కరెన్సీ బాస్కెట్‌లో డాలర్ బలోపేతం... ఫెడ్ రేటు పెంచవచ్చని భయాలు... విదేశీ నిధులు పెద్ద ఎత్తున బయటకు వెళ్లిపోవచ్చన్న ఆందోళనలు... స్టాక్ మార్కెట్‌కు భారీ నష్టాలు... ఈ పరిణామాలు శుక్రవారం రూపారుుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపారుు.

కదలికలు ఇలా...
దిగుమతిదారులు, కార్పొరేట్ల నుంచి డాలర్‌కు తీవ్రమైన డిమాండ్ వచ్చింది. దీనితో క్రితం ముగింపు 66.63తో పోల్చిచూస్తే- ప్రారంభంలోనే గ్యాప్ డౌన్ (క్రితం కన్నా బలహీనత)తో 67.20 వద్ద రూపారుు ట్రేడింగ్ ప్రారంభమైంది. తీవ్ర ఒడిదుడుకులతో చివరకూ బలహీనతలోనే ముగిసింది.

Advertisement
Advertisement