హైదరాబాద్‌లో అమెజాన్‌ భారీ డెలివరీ స్టేషన్‌

20 Jun, 2019 13:26 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అతిపెద్ద డెలివరీ స్టేషన్‌ను బుధవారం హైదరాబాద్‌లో  ప్రారంభించింది. 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో గచ్చిబౌలిలో నెలకొల్పిన ఈ కేంద్రం ద్వారా రంగారెడ్డి జిల్లాలోని కస్టమర్లకు వేగంగా ఉత్పత్తులను డెలివరీ చేయడానికి వీలవుతుందని కంపెనీ తెలిపింది. తెలంగాణలో మొత్తం 90 డెలివరీ స్టేషన్లున్నాయని, వీటిలో ఒక్క హైదరాబాద్‌లో 12 విస్తరించాయని అమెజాన్‌ ఇండియా లాస్ట్‌ మైల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ డైరెక్టర్‌ ప్రకాశ్‌ రోచ్‌లానీ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.

32 లక్షల చదరపు అడుగుల విస్తర్ణంలో మూడు ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలు, లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు సార్ట్‌ సెంటర్లు భాగ్యనగరిలో ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు. కిరాణా స్టోర్ల వంటి 2,500 వరకు ‘ఐ హావ్‌ స్పేస్‌’ డెలివరీ/పికప్‌ కేంద్రాలు విస్తరించాయని పేర్కొన్నారు. తెలంగాణలో 17,000 మంది సెల్లర్లున్నారని వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు