ఆసుస్‌ సూపర్‌ గేమింగ్‌ ఫోన్‌ లాంచ్‌

23 Sep, 2019 14:57 IST|Sakshi

భారీ బ్యాటరీతో ఆసుస్‌ రోగ్‌ ఫోన్‌-2

సాక్షి, న్యూఢిల్లీ: ఆసుస్‌  కంపెనీ  సూపర్‌  గేమింగ్‌ ఫోన్‌ను భారతదేశంలో అధికారికంగా ప్రారంభించింది. నెక్స్ట్-జెన్ గేమింగ్-ఫోకస్‌గా రోగ్‌ ఫోన్‌ను సోమవారం ఆవిష్కరించింది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ , 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్‌ స్క్రీన్‌ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ సాక్‌, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌, బీఫీ బ్యాటరీ, గేమ్ కూలింగ్, డ్యూయల్ వైబ్రేషన్ మోటార్లు ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. రోగ్‌-2లో ప్రాసెసర్‌ 15 శాతం వేగవంతమైన గ్రాఫిక్స్ పనితీరును అందిస్తుందని కంపెనీ తెలిపింది.  రెండు వేరియంట్లలో 18 వాట్స్‌, 30వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ బ్యాటరీని అమర్చింది. బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో భాగంగా ఈ హ్యాండ్‌సెట్ దేశంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి  లభ్యం కానుంది. 

ఆసుస్‌ రోగ్‌ ఫోన్‌ -2 ఫీచర్లు 
6.59-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే 
ఆండ్రాయిడ్‌ 9.0పై
2340 x 1080 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
48+13 ఎంపీ రియర్‌ కెమెరా
24 ఎంపీ సెల్పీ  కెమెరా
6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ధరలు 
8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ .37,999 
12జీబీ ర్యామ్ /512 జీబీ స్టోరేజ్ వేరియంట్, రూ. 59,999

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా