కరోనా ఎఫెక్ట్‌తో స్టాక్‌ మార్కెట్‌ కుదేలు..

4 Mar, 2020 18:40 IST|Sakshi

ముంబై : స్టాక్‌ మార్కెట్‌ను కరోనా వైరస్‌ కుదిపివేస్తోంది. భారత్‌లో కరోనా కేసులు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ చేసిన వ్యాఖ్యలతో బుధవారం స్టాక్‌మార్కెట్లు కుదేలయ్యాయి. ప్రారంభంలో లాభాలతో ఉత్తేజంగా ఉన్న మార్కెట్‌ ఆపై కరోనా కేసులు పెరిగాయన్న వార్తలతో డీలా పడింది. సెషన్‌ చివరిలో పుంజుకున్నా చివరికి నష్టాలతో ముగిసింది. ఐటీ, ఫార్మా మినహా మిగిలిన రంగాల షేర్లు నష్టపోయాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 214 పాయింట్ల నష్టంతో 38,409 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక 52 పాయింట్లు కోల్పోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,251 పాయింట్ల వద్ద క్లోజయింది.

చదవండి : ఎగిసి‘పడిన’ స్టాక్‌ మార్కెట్లు

మరిన్ని వార్తలు