ఆటో షేర్లలో అమ్మకాలతో స్టాక్‌ మార్కెట్‌ డీలా

29 Jul, 2019 10:40 IST|Sakshi

ముంబై : ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడితో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభ లాభాలను కోల్పోయాయి. నూతన వాహనాలపై రిజిస్ర్టేషన్‌ చార్జీలను పెంచాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో ఆటో మొబైల్‌ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 109 పాయింట్ల నష్టంతో 37,770 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 50 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 11,233 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అన్ని రంగాల ఇండెక్స్‌లు పతనమయ్యాయి. ఇక బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్ప్‌, వేదాంత, మారుతి సుజుకి, టాటా మోటార్స్‌ తదితర షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఐటీ షేర్లు స్వల్పంగా లాభపడుతున్నాయి.

>
మరిన్ని వార్తలు