దలాల్‌ స్ట్రీట్‌లో శాంటాక్లాజ్‌ లాభాలు

23 Dec, 2023 06:35 IST|Sakshi

ఐటీ, మెటల్‌ షేర్లకు డిమాండ్‌

సూచీలకు రెండో రోజూ లాభాలు 

మళ్లీ 71,000 పాయింట్ల పైకి సెన్సెక్స్‌

21,300 పాయింట్ల ఎగువకు నిఫ్టీ

ముంబై: క్రిస్మస్‌కు ముందు దలాల్‌ స్ట్రీట్‌లో శాంటా క్లాజ్‌ ర్యాలీ కనిపించింది. పతనమైన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్‌ సూచీలు రెండో రోజూ లాభపడ్డాయి. ఐటీ, మెటల్, టెక్, ఆటో, ఫార్మా, రియల్టీ షేర్లు రాణించాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 242 పాయింట్లు పెరిగి 71,107 వద్ద నిలిచింది. నిఫ్టీ 94 పాయింట్లు బలపడి 21,349 వద్ద స్థిరపడింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన స్టాక్‌ సూచీలు ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర లాభ, నష్టాల మధ్య కదలాడాయి.

ఒక దశలో సెన్సెక్స్‌ 395 పాయింట్లు లాభపడి 71,260 వద్ద, నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 21,390 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్‌ లభించడంతో బీఎస్‌ఈ స్మాల్, మిడ్‌ క్యాప్‌ షేర్లు 1.04%, 0.75% చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,829 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,167 కోట్ల షేర్లు కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.  

► పబ్లిక్‌కు కనీసం 25 శాతం వాటా(ఎంపీఎస్‌) కలి్పంచే అంశంలో పదేళ్ల గడువు లభించడంతో ఎల్‌ఐసీ షేరు 4% పెరిగి రూ.793 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 7% పెరిగి రూ.820 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. షేరు నాలుగు లాభపడంతో కంపెనీ మార్కెట్‌ విలువ ఒక్క రోజులో రూ.18,057 కోట్లు పెరిగి రూ.5.01 లక్షల కోట్లకు చేరింది.  
► ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు రాణించాయి. విప్రో 6.55%, పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ 4%, ఎంఫసీస్, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3%, కోఫోర్జ్‌ 2.50%, ఎల్‌అండ్‌టీఎం, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ ఒకటిన్నర శాతం, ఎల్‌టీటీఎస్, టీసీఎస్‌ షేర్లు ఒకశాతం చొప్పున
లాభపడ్డాయి.
► స్టాక్‌ మార్కెట్‌ వరుస 3 రోజులు పనిచేయదు. శని, ఆదివారాలు సాధారణ సెలవులు కాగా, సోమవారం(డిసెంబర్‌ 25న) క్రిస్మస్‌ సందర్భంగా ఎక్చే్చంజీలు పనిచేయవు. ట్రేడింగ్‌ తిరిగి మంగళవారం యథావిధిగా ప్రారంభం అవుతుంది.
► అజాద్‌ ఇంజనీరింగ్‌ ఐపీఓకు 80.60 రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.01 కోట్ల ఈక్విటీలు జారీ చేయగా మొత్తం 81.58 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. ఐబీ కోటా 179.66 రెట్లు, సంస్థాగతేర ఇన్వెస్టర్లు విభాగం 87.55 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల విభాగం 23.71 రెట్లు సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది.  
► కెనిడియన్‌ బిలియనీర్‌ ప్రేమ్‌ వాట్సా గ్రూప్‌ ఫెయిర్‌ఫాక్స్‌ గ్రూప్‌.., ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ సంస్థలో 5.7% వాటాను దక్కించుకుంది. ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా ఎఫ్‌ఐహెచ్‌ మారిషన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌ నుంచి ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌కు చెందిన 2.16 కోట్ల ఈక్విటీల(5.7% వాటా)ను రూ.1,198 కోట్లకు కొనుగోలు చేసినట్లు బల్క్‌డీల్‌ డేటా తెలిపింది. ఈ లావాదేవీ తర్వాత  ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ షేరు 4% నష్టపోయి రూ.573 వద్ద స్థిరపడింది. 

>
మరిన్ని వార్తలు