సాక్షి మనీ మంత్ర: ఒడుదొడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు

22 Dec, 2023 16:19 IST|Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం తీవ్ర ఒడుదొడుకులతో కదలాడాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి నిఫ్టీ 94 పాయింట్లు లాభపడి 21,349 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 241 పాయింట్లు పుంజుకుని 71,106 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా మోటార్స్‌, మారుతీ సుజుకి, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఎల్‌ అండ్‌ టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఏషియన్‌ పేయింట్స్‌, టైటాన్‌, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. బజాన్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

బ్యాంకులు మినహా, ఇతర రంగాల సూచీలు ఆటో, క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్, ఆయిల్ & గ్యాస్ 1 శాతం చొప్పున లాభపడగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటల్, రియల్టీ 2 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతం చొప్పున పెరిగాయి. సానుకూల దేశీయ మార్కెట్లు, బలహీనమైన యుఎస్ డాలర్‌తో భారత రూపాయి శుక్రవారం పెరిగింది. అయితే, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, ఎఫ్‌ఐఐ అవుట్‌ఫ్లోలు కొంత లాభాలను తగ్గించాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).

>
మరిన్ని వార్తలు