విస్తరణ యోచనలో బీఎంబీ

10 Feb, 2015 02:40 IST|Sakshi
విస్తరణ యోచనలో బీఎంబీ

చెన్నై: ప్రభుత్వ భారతీయ మహిళ బ్యాంక్ (బీఎంబీ) తన సేవలను మరింతగా విస్తరించనుంది. దీంతో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ బ్యాంక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే నెలలో దేశం మొత్తం మీద 35 బ్రాంచ్‌లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు భారతీయ మహిళా బ్యాంక్ చైర్‌పర్సన్, ఎండీ ఉషా అనంతసుబ్రమణ్యన్ చెప్పారు. దీంతో మహిళా బ్యాంక్ మొత్తం శాఖలు 80కి చేరుకుంటాయి. అలాగే వచ్చే వారం మొబైల్ ఆప్‌ను సేవలనూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆమె తెలిపారు.

15 నెలల క్రితం బ్యాంక్ ప్రారంభించే సమయంలో ప్రభుత్వం మాకిచ్చిన మూలధనం రూ.1,000 కోట్లని ఈ సందర్భంగా అనంతసుబ్రమణ్యన్ గుర్తు చేశారు. ఈ నిధులు బ్యాంక్ సేవలను బలోపేతం చేసేందుకు, విస్తరణ చేసేందుకు సరిపోతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాని జన్‌ధన్ యోజన పథకం కింద ఇప్పటివరకు 66 వేల ఖాతాలను తెరిచినట్టు గుర్తు చేశారు. ఈ ఏడాది రూ.1,800 కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

మరిన్ని వార్తలు