హోండా బీఎస్‌-6 బైక్‌ ‘ఎస్‌పీ 125’ లాంచ్‌

15 Nov, 2019 08:52 IST|Sakshi

ప్రారంభ ధర రూ. 72,900

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తాజాగా భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)–6 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న సరికొత్త బైక్‌ను దేశీ మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఎస్‌పీ 125’ పేరిట విడుదలైన ఈ అధునాతన బైక్‌ ప్రారంభ ధర రూ. 72,900. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి దేశవ్యాప్తంగా నూతన ఉద్గార నిబంధనలు అమలుకానున్న నేపథ్యంలో సీబీ షైన్‌ ఎస్‌పీ 125 మోటార్‌ సైకిల్‌ స్థానాన్ని భర్తీ చేయడానికి ఈ బైక్‌ను తెచ్చినట్లు కంపెనీ ప్రకటించింది.

ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మినోరు కటో మాట్లాడుతూ.. ‘125 సీసీ విభాగంలో సాంకేతికత, శైలి, పనితీరు పరంగా కొత్త మోడల్‌ మరింత మెరుగుపడింది. మునుపటి మోడల్‌తో పోలిస్తే ధర 11 శాతం పెరగ్గా, మైలేజీ 16 శాతం పెరిగింది’ అని చెప్పారు. ఈ విభాగంలో 80 లక్షల యూ నిట్లు అమ్ముడుపోగా, మార్కెట్‌ వాటా 39% గా ఉందని కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యాద్విందర్‌ సింగ్‌ గులేరియా చెప్పారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా : పాలసీదారులకు గుడ్ న్యూస్ 

హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ : రూ.150  కోట్ల సాయం  

నేడు మార్కెట్లకు సెలవు

కరోనాపై పోరు : గూగుల్ భారీ సాయం

దివాలా అంచున ఎయిర్‌లైన్స్‌

సినిమా

వారి పెళ్లి పెటాకులేనా?!

రానాతో కలిసి బాలకృష్ణ మల్టీస్టారర్‌ మూవీ!

కరోనా: ట్రెండింగ్‌లో ఆర్జీవీ ‘పురుగు’ పాట!

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం