బుల్లెట్‌ ట్రెయిన్‌: బీహెచ్‌ఈఎల్ జోష్‌

15 Sep, 2017 09:02 IST|Sakshi
బుల్లెట్‌ ట్రెయిన్‌: బీహెచ్‌ఈఎల్ జోష్‌

సాక్షి, ముంబై: దేశంలో తొలి బుల్లెట్‌ ట్రెయిన్‌ ప్రాజెక్టును దక్కించుకుందన్న వార్తలతో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (బీహెచ్‌ఈఎల్‌)  మార్కెట్‌లో దూసుకుపోతోంది. రూ. 1.1 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టనున్న దేశంలోని  తొలి బుల్లెట్‌  ట్రెయిన్‌ ప్రాజెక్టును దక్కించుకునేందుకు బీహెచ్‌ఈఎల్‌ కవాసాకితో కలిసి పని చేయనుందనే  అంచనాలు  ఇండస్ట్రీలో భారీగా నెలకొన్నాయి. ఈ  నేపథ్యంలో భెల్‌ కౌంటర్‌కు   డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో దాదాపు  గురువారం 10 శాతం పెరిగింది. దీంతో ఈ ఏడాదిలోనే ఇది అ‍త్యంత ఎక్కువ పెరుగుదలగా నమోదైంది.   

అహ్మదాబాద్-ముంబై హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్  రోలింగ్ స్టాక్ కోసం భెల్, కవాసాకి హెవీ ఇండస్ట్రీస్ కలిసి పనిచేస్తాయని  జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే వ్యాఖ‍్యలను ఉటంకిస్తూ బ్లూంబెర్గ్‌  నివేదించింది. మరోవైపు ఇది తమకు మంచి ప్రోత్సాహాన్నందిస్తుందని భెల్‌ సీఎండీ తెలిపారు.  దీంతో బీహెచ్ఈఎల్ స్టాక్‌  భారీ లాభాలతో 52 వారాల గరిష్టాన్ని తాకింది.

కాగా  జ‌పాన్ సాయంతో దేశంలో తొలిసారిగా బుల్లెట్ రైలు నిర్మాణానికి  కేంద్రం  నాంది పలికింది.  ముంబై నుంచి అహ్మ‌దాబాద్ మ‌ధ్య బుల్లెట్ రైలు నిర్మాణ ప‌నుల‌కు  భారత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే  గురువారం అహ్మ‌దాబాద్ లో శంకుస్థాప‌న చేశారు.

మరిన్ని వార్తలు