ఆ దేశాలు.. నల్ల కుబేరులకు స్వర్గాలు | Sakshi
Sakshi News home page

ఆ దేశాలు.. నల్ల కుబేరులకు స్వర్గాలు

Published Thu, Sep 14 2017 11:22 AM

ఆ దేశాలు.. నల్ల కుబేరులకు స్వర్గాలు - Sakshi

  • స్విస్‌ బ్యాంక్‌లో తగ్గిన డిపాజిట్లు
  • ఆసియాదేశాల్లో డబ్బు దాస్తున్న నల్ల కుబేరులు
  • 53 శాతం డబ్బును నాలుగు దేశాల్లో పెట్టిన వైనం
  • జీడీపీలో నల్లధనం వాటా 3.1 శాతం
  • ఫలించని ప్రభుత్వ ప్రయత్నాలు
  • పనామా పేపర్ల లీకేజీతో స్విస్‌బ్యాంక్‌కు దూరం


  • న్యూఢిల్లీ : 2007 నుంచి 2015 మధ్యకాలంలో దేశంనుంచి బయటకి వెళ్లిన ధనం ఎంతో మీకు తెలుసా? ఊహకందని అంత సొమ్మును దేశం ఎలా దాటించారు? నల్ల కుబేరులకు, పన్ను ఎగవేత దారులకు స్వర్గధామంలా ఉన్న దేశాలు ఏవి? కోట్లకొద్ది ధనాన్ని నల్లకుబేరులు ఎలా తీరం దాటించగలుగుతున్నారు? అన్న ప్రశ్నలు సాధారణంగా అందరికీ వస్తుంటాయి..  ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే.. ఈ స్టోరీని కొంచెం చదవాల్సిందే.

    2007-15 మధ్య కాలం‍లో మన దేశం నుంచి బయటకు తరలివెళ్లిన మొత్తం అక్షరాలా 4 లక్షల కోట్ల రూపయాలు. ఈ మొత్తాన్ని నల్ల కుబేరులు, పన్ను ఎగవేత దారులు వివిధ మార్గాల్లో దేశాన్ని దాటించారు. ఈ మొత్తం విలువ.. 2015 నాటి మన దేశ జీడీపీలో 3.1 శాతం.

    ఎక్కడ దాస్తున్నారు?
    గతంతో పోలిస్తే స్విట్జర్లాండ్‌లోని స్విస్‌ బ్యాంక్‌ అంత సురక్షితం కాకపోవడంతో.. ఆసియాలోని సింగపూర్‌, మలేషియా, హాంగ్‌కాంగ్‌, బహ్రెయిన్‌ దేశాల్లోనే నల్ల కుబేరులు ధనాన్ని దాస్తున్నారు. పన్ను ఎగవేత దారులు కేవలం ఈ నాలుగు దేశాల్లోనే 53 శాతం మొత్తాన్ని మళ్లించినట్లు బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషన్‌ సెటిల్‌మెంట్స్‌  (బీఐఎస్‌) సంస్థ ప్రకటించింది. ఇక స్విస్‌ బ్యాంక్‌ళక్ష 38 శాతం మేర మొత్తాలను దాచినట్లు బీఐఎస్‌ తెలిపింది. 2007లో ఈ మొత్తం 58 శాతం ఉండగా.. కొంతకాలంగా తగ్గుముఖం పట్టింది.

    ఫలించని ప్రయత్నాలు
    నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితం ఇవ్వలేదని అంతర్జాతీయ ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. పనామా పేపర్ల లీకేజీ తరువాత స్విట్జర్లాండ్‌ కొం‍త వరకూ పారదర్శకంగా ఉన్నా అదేమంత ఆశించి ఫలితాన్ని ఇవ్వలేదనే చెప్పాలి.  స్విట్జర్లాండ్‌ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయన్నఆలోచనతోనే పన్ను ఎగవేతదారులు తమ డబ్బును మలేషియా, సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌వంటి దేశాలకు మళ్లించారు.

    ప్రపంచ దేశాల్లోనూ..!
    నల్లధనం అనేది ఒక్క భారత్‌నేకాక ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనమిక్‌ రీసెర్చ్‌, నార్వేయన్ యూనివర్సిటీ ఆఫ్‌ కోపెన్‌హాగన్‌ల అంచనాల మేరకు 2007-15 మధ్య కాలంలో ‌ప్రపంచ దేశాల నుంచి.. సరిహధ్దుల దాటిన నల్లధనం విలువ 8.6 ట్రిలియన్‌ డాలర్లు. ఈ మొత్తం ప్రపంచ జీడీపీలో 11.6 శాతం.   ఇందులో రియల్‌ ఎస్టేట్‌ వంటి నాన్‌ ఫైనాన్షియల్‌ ఆస్తులను కలపలేదు.. వాటిని కూడా జోడిస్తే.. ఈ మొత్తం ఊహలకు అందదు.



     

Advertisement
Advertisement