కెనరా బ్యాంక్‌కు తగ్గిన మొండి బకాయిలు 

24 Jan, 2020 04:08 IST|Sakshi

ముంబై: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) మూడో త్రైమాసిక కాలంలో రూ.330 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో లాభం, రూ.318 కోట్లుతో పోల్చితే 4% వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం రూ.13,513 కోట్లతో నుంచి రూ.14,002 కోట్లకు పెరిగింది.

బ్యాంక్‌ మొండి బకాయిలు తగ్గాయి. గత క్యూ3లో 6.37 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 5.05 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 10.25% నుంచి 8.26 శాతానికి చేరాయి. గత క్యూ3లో రూ.1,977 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ3లో రూ.1,803 కోట్లకు తగ్గాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా