వేతన జీవులకు మరో బ్యాడ్‌న్యూస్‌

22 May, 2018 17:01 IST|Sakshi
ఆఫీసు క్యాంటీన్‌ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : మధ్యతరగతి ప్రజలకు లేదా వేతన జీవులకు మరో షాకింగ్‌ న్యూస్‌. ఫ్యాక్టరీలు లేదా ఆఫీసు క్యాంటీనల్లో అందించే కేటరింగ్‌ సర్వీసులపై జీఎస్టీని 5 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. ఈ విషయాన్ని గుజరాత్‌ అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌(ఏఏఆర్‌) తెలిపింది. సర్వీసులపై జీఎస్టీ పెంపును ఏఏఆర్‌ ప్రతిపాదించిన అనంతరం ఆఫీసులు, ఇండస్ట్రీ క్యాంటీన్లలో అందించే కేటరింగ్‌ సర్వీసులపై 18 శాతం రేటు అమల్లోకి వస్తున్నట్టు ఎకనామిక్‌ టైమ్స్‌ రిపోర్టు చేసింది. 28.06.2017 నాటి సెంట్రల్‌ ట్యాక్స్‌ నోటిఫికేషన్‌ నెం.11/2017 ప్రకారం అవుట్‌డోర్‌ కేటరింగ్‌ సర్వీసుల కింద ఆఫీసులు, ఇండస్ట్రీ క్యాంటిన్లకు అందించే కేటరింగ్‌ సర్వీసులపై 18 శాతం జీఎస్టీ విధించాలని ఏఏఆర్‌ ప్రతిపాదించింది. దీంతో క్యాంటీన్‌ సర్వీసులు అందజేసే రేష్మి హాస్పిటాలిటీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అవుట్‌డోర్‌ కేటరింగ్‌ సర్వీసుల కింద 18 శాతం జీఎస్టీని విధిస్తోంది. దీనిపై కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

కేటరింగ్‌ సర్వీసులపై 18 శాతం జీఎస్టీ విధించాలా? లేదా 5 శాతం జీఎస్టీ విధించాలా? అనే వివాదం చెలరేగింది. ఈ వివాదం నేపథ్యంలో ఏఏఆర్‌ పలు అంశాలను పరిశీలించి కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. జీఎస్టీ నిబంధనల కింద అవుట్‌డోర్‌ కేటరింగ్‌ అనే పదమే లేదని, అంతకముందు సర్వీసు పన్ను పాలనపై అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును, కొన్ని కీలక పాయింట్లను పరిగణలోకి తీసుకుంటే, ఆఫీసు లేదా ఇండస్ట్రీ ఫ్యాక్టరీలలో అందజేసేవి క్యాంటీన్‌ సర్వీసులే కాదని తేల్చి చెప్పింది. వీటిపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని తెలిపింది. అవుట్‌డోర్‌ కేటరింగ్‌ ఈ సర్వీసులను అందజేస్తున్నాడని, ఈ నేపథ్యంలో 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు