ఆధార్‌ లేని పాన్‌ కార్డులు పనికొస్తాయా?

1 Jul, 2017 07:17 IST|Sakshi
ఆధార్‌ లేని పాన్‌ కార్డులు పనికొస్తాయా?
న్యూఢిల్లీ :  పాన్‌ కార్డును ఆధార్‌తో రేపటి వరకు లింక్‌ చేసుకోవాలని, లేకపోతే పాన్‌ కార్డు పనికి రాకుండా పోతుందంటూ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు చెలరేగాయి. ఈ ఊహాగానాలన్నింటిని ఆదాయపు పన్ను శాఖ  కొట్టిపారేసింది. ఆధార్‌తో లింక్‌ చేసుకోని  పాన్‌ కార్డులను రద్దు చేయమని ఆదాయపు పన్ను శాఖ స్పష్టంచేసింది. బుధవారం జారీచేసిన నోటిఫికేషన్‌లో  ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.'' ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిసవసరం లేదు. జూన్‌ 30 తర్వాత పాన్‌ పనికి రాకుండా పోదు'' అని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్‌ సుశిల్‌ చంద్రా చెప్పారు.
 
ఆధార్‌తో లింకులేని పాన్‌లు  ఎప్పుడు పనికిరాకుండా పోతాయో ఆ తేదీలను బోర్డు తర్వాత నోటిఫై చేస్తుందని తెలిపారు. 2017 జూలై వరకు ఎవరైతే పాన్‌ కార్డును కలిగి ఉంటారో, వారందందరూ సెక్షన్‌ 139ఏఏ సబ్‌-సెక్షన్‌ 2 ప్రొవిజన్స్‌ కింద ఆధార్‌ నెంబర్‌ను పాన్‌కార్డులకు లింక్‌ చేసుకోవాలని ఈ వారంలో మొదట్లోనే ప్రభుత్వం ఓ నోటిఫికేషన్‌లో పేర్కొంది. పాన్‌తో ఆధార్‌ను లింక్‌ చేసుకునే ప్రక్రియకు చివరి తేదీగా జూన్‌ 30ను నిర్ణయించింది. దీంతో ఒక్కసారిగా పాన్‌తో ఆధార్‌ను లింక్‌ చేసుకునే ప్రక్రియలో ప్రజలందరూ నిమగ్నమై పోయారు. ఒకవేళ ఈ ప్రక్రియ జూన్‌ 30కి ముగియకపోతే, పాన్‌ కార్డులు పనికి రాకుండా పోతాయని ప్రజల్లో భయాందోళన చెలరేగింది. కానీ ఆధార్‌తో లింక్‌ లేకపోయినప్పటికీ పాన్‌ కార్డులు పనికి వస్తాయని తాజాగా సీబీడీటీ స్పష్టంచేసింది.   
 
మరిన్ని వార్తలు